పంచదగా | - | Sakshi
Sakshi News home page

పంచదగా

Oct 7 2026 12:05 AM | Updated on Oct 7 2026 12:05 AM

8లో

న్యూస్‌రీల్‌

మూడు దశాబ్దాలుగా పరిష్కారం శూన్యం ప్రతి ఎన్నికల ముందూ టీడీపీ బూటకపు హామీలు మూడుసార్లు మాటిచ్చినా మళ్లీ అదే తంతు స్థానిక ఎన్నికల వేళ మళ్లీ మోసపు పాట

బుధవారం శ్రీ 7 శ్రీ అక్టోబర్‌ శ్రీ 2026

సీఐఐ రీజినల్‌ సమ్మిట్‌ను జయప్రదం చేయండి

పంచగ్రామాల భూసమస్యకు బాబు గండం

సాక్షి, విశాఖపట్నం: సింహాచలం పంచగ్రామాల భూసమస్య.. చంద్రబాబు దశాబ్దాల హామీలకు, బాధితుల దశాబ్దాల ఎదురుచూపులకు ప్రతీకగా మారింది. ఏళ్లు గడుస్తున్నా శాశ్వత పరిష్కారం లభించడం లేదు. టీడీపీ అధికారంలోకి వచ్చిన ప్రతిసారీ ‘100 రోజుల్లో పంచగ్రామాల సమస్యను పరిష్కరిస్తాం’ అని హామీ ఇవ్వడం.. ఆ తర్వాత దాన్ని పక్కనపెట్టడం పరిపాటిగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సింహాచలం దేవస్థానం పరిధిలోని అడవివరం, వేపగుంట, చీమలాపల్లి, పురుషోత్తపురం, వెంకటాపురం గ్రామాల్లోని భూములే పంచగ్రామాలుగా పిలువబడుతున్నాయి. వేలాది ఎకరాల భూమి దేవస్థానానికి చెందిన ఇనామ్‌ భూములుగా రెవెన్యూ రికార్డుల్లో నమోదై ఉండగా.. దశాబ్దాల కిందటే ఇక్కడ పేద, మధ్యతరగతి ప్రజలు ఇళ్లు నిర్మించుకుని నివసిస్తున్నారు. రికార్డుల్లో స్పష్టత లేక ఇళ్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో బాధితులు ఇబ్బందులు పడుతున్నారు.

చంద్రబాబు హయాంలోనే బీజం

పంచగ్రామాల భూసమస్యకు చంద్రబాబు హయాంలోనే బీజం పడింది. 1996–97లో వీటిని సింహాచలం దేవస్థానం భూములుగా పేర్కొంటూ రైత్వారీ పట్టాల జారీ ప్రక్రియ చేపట్టడంతో వివాదం మరింత ముదిరింది. మొత్తం 11,282.26 ఎకరాల విస్తీర్ణంలో 9,069.22 ఎకరాలకు రైత్వారీ పట్టాలు ఉండగా, మరో 1,785 ఎకరాల్లో ఇళ్లు, ఇతర నిర్మాణాలు ఉన్నాయి. 2000లో జీవో–578 ద్వారా భూముల క్రమబద్ధీకరణకు చర్యలు చేపట్టినా శాశ్వత పరిష్కారం లభించలేదు. చంద్రబాబు మూడుసార్లు ముఖ్యమంత్రిగా పనిచేసినప్పటికీ ఈ సమస్యను పరిష్కరించకపోవడం ఆయన బాధ్యతారాహిత్యానికి నిదర్శనం.

కోర్టుల పేరుతో కాలయాపన

2008లో కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో నిర్వహించిన సర్వేలో పంచగ్రామాల పరిధిలో 420 ఎకరాల్లో 12,149 నిర్మాణాలు ఉన్నట్లు తేల్చారు. జీవో–578 ద్వారా క్రమబద్ధీకరణకు శ్రీకారం చుట్టగా సుమారు 6,110 మంది దరఖాస్తు చేసుకున్నారు. కానీ అందులో కేవలం 2,485 దరఖాస్తుల ప్రక్రియ మాత్రమే పూర్తయింది. ఇంతలోనే కోర్టుల్లో పిటిషన్లు దాఖలు కావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ఆ తర్వాత 2014లో అధికారంలోకి వచ్చిన టీడీపీ ప్రభుత్వం.. నగర శివారులో దేవస్థానానికి ప్రత్యామ్నాయ భూములు ఇస్తామని చెప్పింది. అయితే హైకోర్టులో సమర్పించిన నివేదికల్లో కావాలనే కొన్ని మెలికలు పెట్టి, తీర్పు రాకుండా అడ్డుకున్నారనే ఆరోపణలు బలంగా ఉన్నాయి. నాడు 12 వేలుగా ఉన్న నిర్మాణాలు నేడు 50 వేలకు చేరాయని, బహుళ అంతస్తులు వెలిశాయని దేవదాయ శాఖ ద్వారా కేసులను మరింత జటిలం చేయడంలో నాటి చంద్రబాబు సర్కారే కీలక పాత్ర పోషించిందని స్థానికులు మండిపడుతున్నారు.

100 రోజుల్లో పరిష్కారం.. ఏమైంది?

2014లో అధికారంలోకి వచ్చిన వెంటనే పంచగ్రామాల సమస్యను 100 రోజుల్లో పరిష్కరిస్తామని చంద్రబాబు అబద్ధపు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక ఆంధ్ర విశ్వవిద్యాలయంలో నిర్వహించిన తొలి కేబినెట్‌ సమావేశంలోనూ మొక్కుబడిగా చర్చించి, ప్రత్యామ్నాయ భూములను గుర్తించి క్రమబద్ధీకరణ చేస్తామని ప్రకటనలకే పరిమితమయ్యారు. ఆ తర్వాత ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు.

వైఎస్సార్‌సీపీ హయాంలో కదలిక

టీడీపీకి ఈ సమస్యను పరిష్కరించే ఉద్దేశం లేదని గత అనుభవాలే నిరూపిస్తున్నాయి. అయితే, 2019లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధికారంలోకి వచ్చాక సమస్యకు శాశ్వత పరిష్కారం చూపేందుకు సానుకూల వాతావరణం ఏర్పడింది. కోర్టులో ఉన్న పీఠాధిపతుల కేసులను పరిష్కరించి, వారి సూచనలతో క్రమబద్ధీకరణకు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. దేవాదాయ శాఖ భూములకు ప్రత్యామ్నాయంగా విశాఖ పరిసర ప్రాంతాల్లో రూ. 5,231.01 కోట్ల విలువైన 610.89 ఎకరాల భూములను ప్రభుత్వం గుర్తించింది. ఇందులో గాజువాకలో 91.1 ఎకరాలు, మల్కాపురంలో 293.54 ఎకరాలు, పెదగంట్యాడలో 166.2 ఎకరాలు, గుళ్లపాలెంలో 60.05 ఎకరాలు ఉన్నాయి. ఇలా నిర్మాణాత్మక అడుగులు పడుతున్న తరుణంలోనూ టీడీపీ అనుకూల వర్గాలు కోర్టుల్లో పిటిషన్లు వేయించి ఈ ప్రక్రియను అడ్డుకోవాలని చూశాయనేది బహిరంగ రహస్యం.

2024లో మళ్లీ అదే బూటకపు హామీ..

2024 ఎన్నికలకు ముందు టీడీపీ మరోసారి పంచగ్రామాల సమస్యను తెరపైకి తెచ్చి, అధికారంలోకి రాగానే పరిష్కరిస్తామని మాటిచ్చింది. వైఎస్సార్‌సీపీ హయాంలో ప్రత్యామ్నాయ భూముల గుర్తింపు పూర్తి కావడంతో ఈసారైనా తమ కష్టాలు తొలుగుతాయని ప్రజలు ఆశపడ్డారు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా పరిస్థితిలో మార్పు లేదు. చంద్రబాబు ఎప్పటిలాగే నమ్మించి మోసం చేశారని, తుది పరిష్కారం చూపడం లేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఎన్నికల వేళ మళ్లీ పట్టాల నాటకం

ప్రస్తుతం జీవీఎంసీ ఎన్నికలు సమీపిస్తుండటంతో కూటమి ప్రజాప్రతినిధులు, నాయకులు మళ్లీ అబద్ధపు హామీలతో ప్రజల ముందుకు వస్తున్నారు. మళ్లీ పట్టాలు ఇస్తామంటూ మాటలు చెబుతుండటంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలోనే సమస్య గుర్తుకు రావడం, ఆ తర్వాత ఫైళ్లను మూలన పడేయడం అలవాటుగా మారిందని ధ్వజమెత్తుతున్నారు. పంచగ్రామాల పరిధిలో సుమారు 20 జీవీఎంసీ వార్డులు ఉండటంతో ఈ భూసమస్య రాజకీయంగా అత్యంత కీలకంగా మారింది.

ఆనందపురం: మండలంలోని గంభీరం పంచాయతీ పరిధిలోని ఐఐఎంవీ వేదికగా బుధవారం నిర్వహించనున్న సీఐఐ రీజినల్‌ సమ్మిట్‌ను అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎం.అభిషిక్త్‌ కిశోర్‌ ఆదేశించారు. మంగళవారం ఏపీఈడీబీ సీఈవో సాగిలి షన్మోహన్‌, పరిశ్రమల శాఖ ఎండీ బన్సల్‌, జేసీ బి.విద్యాధరి, డీసీపీ మణికంఠలతో కలిసి కలెక్టర్‌ సమ్మిట్‌ ఏర్పాట్లను పరిశీలించారు.ప్రధాన వేదిక, సమాంతర సమావేశ మందిరాలు, ఎగ్జిబిషన్‌, ఏపీ పెవిలియన్‌, రిజిస్ట్రేషన్‌ కౌంటర్లు, పార్కింగ్‌ ప్రదేశం, సైన్‌బోర్డులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. సమ్మిట్‌కు హాజరయ్యే ప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులను ఆదేశించారు. కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు, రాష్ట్ర మంత్రులు టి.జి.భరత్‌, బి.సి.జనార్దన్‌ రెడ్డితో పాటు ప్రజాప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు హాజరుకానున్న నేపథ్యంలో ఏర్పాట్లలో ఎలాంటి లోపాలు ఉండకూడదని కలెక్టర్‌ స్పష్టం చేశారు.

జీవీఎంసీలో మిల్లెట్‌మార్ట్‌ క్యాంటీన్‌ ప్రారంభం

డాబాగార్డెన్స్‌: జీవీఎంసీ ప్రధాన కార్యాలయం గ్రౌండ్‌ ఫ్లోర్‌లో జీవీఎంసీ, మెప్మా సంయుక్త ఆధ్వర్యంలో నూతనంగా ఏర్పాటు చేససిన మిల్లెట్‌ మార్ట్‌ క్యాంటీన్‌ను ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌గార్గ్‌ మంగళవారం ప్రారంభించారు. కమిషనర్‌ మాట్లాడుతూ కార్యాలయానికి వివిధ పనులపై వచ్చేవారికి, ఉద్యోగులకు ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలు అందుబాటులో ఉంచాలని ఈ క్యాంటీన్‌ ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో అదనపు కమిషనర్లు పీఎం సత్యవేణి, డీవీ రమణమూర్తి, ఎస్‌ఎస్‌ వర్మ, కె.రమేష్‌, తూర్పు జోన్‌ జెడ్సీ శివప్రసాద్‌, ఎగ్జామినర్‌ ఆఫ్‌ అకౌంట్స్‌ వాసుదేవరెడ్డి, డీఆర్‌డీఏ పీడీ లక్ష్మీపతి, ఈఈ గంగాధర్‌, పలువురు అధికారులు పాల్గొన్నారు.

కూటమికి తగిన బుద్ధి చెబుతాం

ప్రభుత్వం దేవస్థానానికి చెందిన భూములను కార్పొరేట్‌ సంస్థలకు, రియల్‌ఎస్టేట్‌ వ్యాపారులకు ధారాదత్తం చేస్తోంది కానీ లక్ష మంది ప్రజల బాధలను పట్టించుకోవడం లేదు. పంచగ్రామాల సమస్యను పరిష్కరించని కూటమి పార్టీలను రాబోయే స్థానిక ఎన్నికల్లో ఓడించి తీరుతాం.

– టి.వి.కృష్ణంరాజు, నాయకుడు,

పంచగ్రామాల భూముల కమిటీ

ఓటుతోనే సమాధానం ఇచ్చేందుకు సిద్ధం

వైఎస్సార్‌సీపీ హయాంలో క్రమబద్ధీకరణకు అన్ని ఏర్పాట్లు చేస్తే, ఆ పార్టీకి మంచి పేరు వస్తుందనే కుట్రతో చంద్రబాబు మనుషులతో పిల్‌ వేయించి అడ్డుకున్నారు. స్థానిక ఎన్నికల వేళ మళ్లీ నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. తక్షణమే స్పందించకపోతే కూటమికి తగిన శాస్తి జరుగుతుంది.

– గోపాలకృష్ణ, శ్రీనివాసనగర్‌ కాలనీవాసి,

గొల్లనారాయణపురం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement