రెడ్‌క్రాస్‌ సేవలు అభినందనీయం | - | Sakshi
Sakshi News home page

రెడ్‌క్రాస్‌ సేవలు అభినందనీయం

Oct 6 2026 1:12 AM | Updated on Oct 6 2026 1:12 AM

మహారాణిపేట: సమాజ సేవలో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ అందిస్తున్న సేవలు ఎంతో అభినందనీయమని జిల్లా కలెక్టర్‌, ఐఆర్‌సీఎస్‌ జిల్లా అధ్యక్షుడు ఎం.అభిషిక్త్‌ కిషోర్‌ కొనియాడారు. మహారాణిపేటలోని రెడ్‌క్రాస్‌ భవన్‌లో సోమవారం నిర్వహించిన వార్షిక సర్వసభ్య సమావేశంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని మాట్లాడారు. సంస్థ విశాఖ జిల్లా చైర్మన్‌ సి.బాలసతీష్‌ మాట్లాడుతూ ఏడాది కాలంగా చేపట్టిన సేవా కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా ఐఆర్‌సీఎస్‌కు సీఎస్‌ఆర్‌ నిధులు అందించిన కార్పొరేట్‌ ప్రతినిధులను, విశేష సేవలు అందించిన రక్తదాతలను కలెక్టర్‌ మెమెంటోలు, ప్రశంసాపత్రాలతో సత్కరించారు. మేనేజింగ్‌ కమిటీ సభ్యుడు మురళీకృష్ణ పట్నాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement