ఆ అనుభూతి వేరే లెవెల్
ట్రైన్ రెస్టారెంట్‌లో బిర్యానీ రుచి బాగుంటుంది. కానీ అంతకంటే ఎక్కువగా ఆకట్టుకునేది రైలు పట్టాలపై కదులుతూ మన టేబుల్ దగ్గరకు వచ్చే ఆ అనుభూతి వేరే లెవెల్. చిన్నప్పటి రైలు ప్రయాణ జ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. కుటుంబంతో, స్నేహితులతో కలిసి ఇక్కడ భోజనం చేయడం ఒక కొత్త అనుభూతిని ఇస్తుంది. ఇక్కడ ఫుడ్‌తో పాటు ఆ ఫీల్, ఆ ఎక్స్‌పీరియన్స్‌నే ఎక్కువగా ఆస్వాదిస్తాం. –నందిని
మహారాణిపేటలో నౌరోజీ రోడ్డు, పోర్ట్ ఆఫీసర్స్ క్వార్టర్స్ దగ్గర కాలం కాస్త వెనక్కి నడుస్తుంది. పాతకాలపు జమీందారీ బంగ్లా ఇంటీరియర్లు, ఘుమఘుమలాడే సంప్రదాయ ఆంధ్రా రుచులు ఇక్కడ ఎదురవుతాయి. కూర్చున్న కొద్దిసేపటికే మీరు రాజులా భోజనం చేస్తున్నట్టు అనిపిస్తుంది. బిల్లు వచ్చాకే మళ్లీ 2026లోకి తిరిగొస్తాం.


