సీఐఐ రీజనల్‌ సమ్మిట్‌కు పకడ్బందీ ఏర్పాట్లు | - | Sakshi
Sakshi News home page

సీఐఐ రీజనల్‌ సమ్మిట్‌కు పకడ్బందీ ఏర్పాట్లు

Oct 4 2026 11:49 AM | Updated on Oct 4 2026 11:49 AM

మహారాణిపేట: ఈ నెల 7న గంభీరం ఐఐఎంలో నిర్వహించనున్న ప్రాంతీయ భాగస్వామ్య సదస్సుకు పకడ్బందీ ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ ఎం. అభిషిక్త్‌ కిశోర్‌ అధికారులను ఆదేశించారు. జీవీఎంసీ కమిషనర్‌ కేతన్‌ గార్గ్‌, జాయింట్‌ కలెక్టర్‌ గొబ్బిళ్ల విద్యాధరితో కలిసి ఏర్పాట్లపై సమీక్షించారు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, పరిశ్రమల ప్రతినిధులు సహా సుమారు 500 మంది హాజరుకానున్న నేపథ్యంలో పార్కింగ్‌, ప్రవేశ పాసులు, భద్రత, పారిశుద్ధ్యం, వైద్య, అగ్నిమాపక, విద్యుత్‌ ఏర్పాట్లు పక్కాగా చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్‌ పెవిలియన్‌, ఎంఎస్‌ఎంఈల ప్రదర్శన, అవగాహన ఒప్పందాలకు సంబంధించిన ఏర్పాట్లపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి సదస్సును విజయవంతం చేయాలన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement