ఏయూతో అమెరికా విశ్వవిద్యాలయం ఎంవోయూ | - | Sakshi
Sakshi News home page

ఏయూతో అమెరికా విశ్వవిద్యాలయం ఎంవోయూ

Oct 4 2026 11:49 AM | Updated on Oct 4 2026 11:49 AM

విశాఖ విద్య: ఏయూతో అమెరికాలోని ఓహియోకు చెందిన బౌలింగ్‌ గ్రీన్‌ స్టేట్‌ యూనివర్సిటీ(బిజీఎస్‌యూ) అవగాహన ఒప్పందం చేసుకుంది. ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్‌ సమక్షంలో ఏయూ రిజిస్ట్రార్‌ ఆచార్య కె.రాంబాబు, బిజీఎస్‌యూ ప్రోవోస్ట్‌–సీనియర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ డాక్టర్‌ రవి క్రోవి ఒప్పంద పత్రాలపై సంతకాలు చేసి పరస్పరం మార్చుకున్నారు. ఈ ఒప్పందంలో భాగంగా విద్యార్థుల మార్పిడి, అధ్యాపకుల మార్పిడి, సంయుక్త పరిశోధనలు, ఉమ్మడి విద్యా కార్యక్రమాల నిర్వహణకు రెండు విశ్వవిద్యాలయాలు అంగీకరించాయి. ఏయూ విద్యార్థులకు ఆన్‌లైన్‌ గెస్ట్‌ లెక్చర్లు నిర్వహించాలని వీసీ రాజశేఖర్‌ బిజీఎస్‌యూ ప్రతినిధులను కోరారు. పరిశోధక విద్యార్థుల మార్పిడి, డ్యూయల్‌ పీహెచ్‌డీ కార్యక్రమాలపై ఆసక్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఏయూ రెక్టార్‌ ఆచార్య పులిపాటి కింగ్‌, పాలక మండలి సభ్యులు, డీన్లు, ప్రిన్సిపాళ్లు, అధికారులు, ఆచార్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement