కొమ్మాది: రుషికొండ బీచ్ అలల్లో చిక్కుకున్న ఇద్దరు పర్యాటకులను లైఫ్‌గార్డులు సకాలంలో రక్షించారు. హైదరాబాద్‌కు చెందిన ఓ కుటుంబం సోమవారం నగరంలోని పర్యాటక ప్రాంతాలు సందర్శించిన అనంతరం సాయంత్రం రుషికొండ బీచ్‌కు చేరుకుంది. సముద్రంలో స్నానం చేస్తుండగా కుటుంబ సభ్యులు రమ్య, కుష్వంత్ సాయి అలల ఉధృతికి సముద్రంలోకి కొట్టుకుపోయారు. విధుల్లో ఉన్న లైఫ్‌గార్డులు వెంటనే స్పందించి వారిని సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. అనంతరం మైరెన్ పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చి ఇంటికి పంపించారు.


