మహారాణిపేట: ప్రజల నుంచి అందిన ఫిర్యాదులు, వినతులను సత్వరమే పరిష్కరించాలని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ జి. విద్యాధరి అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్)లో మొత్తం 354 వినతులు అందాయి. వీటిలో జీవీఎంసీకి 109, రెవెన్యూ శాఖకు 56, పోలీస్ శాఖకు 31, ఇతర శాఖలకు 158 వినతులు నమోదయ్యాయి. ప్రతి వినతిని బాధ్యతాయుతంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
జీవీఎంసీకి 85 వినతులు ..
డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 85 వినతులు అందాయి. కమిషనర్ కేతన్ గార్గ్ ఆదేశాల మేరకు అదనపు కమిషనర్లు ఎస్.ఎస్. వర్మ, డీవీ రమణమూర్తి ఫిర్యాదులు స్వీకరించారు. పట్టణ ప్రణాళికా విభాగానికి అత్యధికంగా 43 వినతులు రాగా, ఇంజినీరింగ్‌కు 16, రెవెన్యూకు 8, జీవీఎంసీ పరిపాలన–ఖాతాల విభాగానికి 5, ప్రజారోగ్యానికి 5, డీడీహెచ్‌కు 4, జోనల్ అడ్మినిస్ట్రేషన్‌కు 2, యూసీడీకి 2 ఫిర్యాదులు అందాయి. వీటి సత్వర పరిష్కారానికి సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ (అమృత్) డి.విజయభారతి, అదనపు కమిషనర్ పి.నల్లనయ్య, ప్రధాన ఇంజినీరు పీవీవీ సత్యనారాయణరాజు, డీసీఆర్ శ్రీనివాసరావు, సీసీపీ ప్రభాకరరావు, ప్రధాన వైద్యాధికారి నరేష్‌కుమార్, ఎగ్జామినర్ ఆఫ్ అకౌంట్స్ వాసుదేవరెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.


