పోలీస్‌ పీజీఆర్‌ఎస్‌కు 125 ఫిర్యాదులు | - | Sakshi
Sakshi News home page

పోలీస్‌ పీజీఆర్‌ఎస్‌కు 125 ఫిర్యాదులు

Aug 4 2026 2:05 AM | Updated on Aug 4 2026 2:05 AM

అల్లిపురం: నగర పోలీస్‌ కమిషనరేట్‌ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 125 ఫిర్యాదులు అందినట్లు నగర పోలీస్‌ కమిషనర్‌ డాక్టర్‌ శంఖబ్రత బాగ్చి తెలిపారు. కార్యక్రమంలో నగరంలోని ఏసీపీలు, సీఐలు, ఎస్సైలు వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొని ఫిర్యాదులు స్వీకరించారు. సీపీ స్వయంగా బాధితుల సమస్యలు తెలుసుకుని, సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అందిన ఫిర్యాదుల్లో కుటుంబ కలహాలు, భూ వివాదాలు, భార్యాభర్తల మధ్య తగాదాలు, మోసాలకు సంబంధించిన కేసులు అధికంగా ఉన్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement