అల్లిపురం: న్యూక్లియర్ విద్యుత్ కేంద్రాల్లో రేడియేషన్ ప్రభావంతో దెబ్బతింటున్న కాంక్రీట్ నిర్మాణాలకు శాశ్వత పరిష్కారం కనుగొనే దిశగా విశాఖకు చెందిన ఇన్స్‌వారెబ్ సంస్థ చేపట్టిన పరిశోధనలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతున్నాయని ఫౌండర్ డైరెక్టర్లు భానుమతి, కాళిదాసు తెలిపారు. సోమవారం వారు విశాఖలో మీడియా తో మాట్లాడారు. ఫ్లైయాష్, ఖనిజ వ్యర్థాలు, పారిశ్రామిక ఉప ఉత్పత్తుల్లోని ఎమార్ఫస్‌లను వినియోగించడం ద్వారా కాంక్రీట్ మన్నికను పెంచే అంశంపై నాలుగు దశాబ్దాలుగా పరిశోధనలు చేసి.. వినూత్న విధానాన్ని రూపొందించినట్లు చెప్పారు. దీని ద్వారా కాంక్రీట్ బలం, సాంద్రత, మన్నిక పెరగడంతో పాటు రేడియేషన్ నిరోధకత కూడా మెరుగుపడే అవకాశాలు ఉన్నాయని పేర్కొన్నారు. తమ పరిశోధనలను తదుపరి దశకు తీసుకెళ్లేందుకు అమెరికాలోని ఇదాహో నేషనల్ లాబొరేటరీ శాస్త్రవేత్తలతో సంప్రదింపులు జరుపుతున్నట్లు వెల్లడించారు.


