డాబాగార్డెన్స్: జీవీఎంసీ ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 93 వినతులు వచ్చాయి. కమిషనర్ కేతన్‌గార్గ్ అదనపు కమిషనర్లు డీవీ రమణమూర్తి, పి.నల్లనయ్యతో కలిసి ఫిర్యాదులు స్వీకరించారు. జోనల్ అడ్మినిస్ట్రేషన్‌కు 2, జీవీఎంసీ అడ్మినిస్ట్రేషన్ అండ్ అకౌంట్స్ విభాగానికి 6, రెవెన్యూ సెక్షన్‌కి 14, ప్రజారోగ్య విభాగానికి 2, ఇంజనీరింగ్‌కు 23, యూసీడీకి 3 ఫిర్యాదులు రాగా పట్టణ ప్రణాళికా విభాగానికి అత్యధికంగా 43 వినతులు వచ్చాయి. కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ (అమృత్) డి.విజయభారతి, ప్రధాన ఇంజనీర్ పీవీవీ సత్యనారాయణరాజు, సీసీపీ ప్రభాకరరావు పలువురు అధికారులు పాల్గొన్నారు.


