మహారాణిపేట: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఏపీఈపీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ‘డయల్ యువర్ సీఎండీ’ కార్యక్రమానికి 45 వినతులు వచ్చాయి. లో–వోల్టేజ్, లైన్ షిఫ్టింగ్, విద్యుత్ అంతరాయాలు, స్తంభాల మార్పిడి వంటి సమస్యలపై వినియోగదారులు నేరుగా ఫిర్యాదు చేశారు. ఈ వినతులను పరిశీలించిన సంస్థ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి..వాటిపై తక్షణ చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వినియోగదారులు తమ విద్యుత్ సమస్యలను టోల్ ఫ్రీ నంబర్ 1912 లేదా వాట్సాప్ నంబరు 9493681912 ద్వారా కూడా తెలియజేయవచ్చని సూచించారు. కార్యక్రమంలో డైరెక్టర్ టీవీ సూర్యప్రకాశ్, సీజీఎంలు వి. విజయలలిత, ఎల్. దైవప్రసాద్, బి. అశోక్ కుమార్ పాల్గొన్నారు.


