అల్లూరి ఆశయాలను కొనసాగిద్దాం | - | Sakshi
Sakshi News home page

అల్లూరి ఆశయాలను కొనసాగిద్దాం

May 8 2026 9:38 AM | Updated on May 8 2026 9:38 AM

తాటిచెట్లపాలెం: మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు వర్ధంతిని పురస్కరించుకుని గురువారం సీతమ్మధార జంక్షన్‌లోని ఆయన విగ్రహానికి వైఎస్సార్‌ సీపీ నాయకులు ఘనంగా నివాళులర్పించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు, పార్టీ నేతలు అల్లూరి విగ్రహానికి పూలమాలలు వేసి ఆయన త్యాగాలను స్మరించుకున్నారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో గిరిజనుల హక్కుల కోసం బ్రిటిష్‌ పాలకులకు వ్యతిరేకంగా పోరాడిన మహనీయుడు అల్లూరి అని కొనియాడారు. ప్రస్తుత తరుణంలో ప్రజల హక్కుల పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ ఆయన స్ఫూర్తితో ఐక్యంగా నిలబడాలని పిలుపునిచ్చారు. కె.కె.రాజు మాట్లాడుతూ.. అల్లూరి చిన్న వయసులోనే వేదాలు అభ్యసించి, ఆధ్యాత్మిక చింతనతో పాటు సామాజిక స్పృహ కలిగి ఉండేవారన్నారు. గత వైఎస్సార్‌ సీపీ ప్రభుత్వ హయాంలో అల్లూరి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించి, ఆయన సేవలను భావితరాలకు తెలిసేలా చేశామని గుర్తు చేశారు. అయితే, ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం అల్లూరి పోరాట భూమి అయిన ఉమ్మడి విశాఖ ప్రాంతానికి, ఆయన స్మృతి కార్యక్రమాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడం బాధాకరమని విమర్శించారు. సమన్వయకర్తలు తిప్పల దేవన్‌రెడ్డి, మొల్లి అప్పారావు, పార్టీ నాయకులు రవిరెడ్డి, సతీష్‌ వర్మ, కొండా రాజీవ్‌ గాంధీ, పి.వి.నారాయణ, కిరణ్‌రాజు, పేర్ల విజయ్‌చంద్ర, జి.వి.రవిరాజు, ద్రోణంరాజు శ్రీ వత్సవ్‌, అంబటి శైలేష్‌, సునీల్‌, అల్లంపల్లి రాజబాబు, అల్లు శంకరరావు, మారుతీప్రసాద్‌, శ్రీదేవివర్మ, మేరువ గణేష్‌, కర్రి రామిరెడ్డి, దేవరకొండ మార్కండేయులు, బోని శివరామకృష్ణ, కేవీఎన్‌ శశికళ, బిపిన్‌కుమార్‌ జైన్‌, రెయ్యి డేవిడ్‌, పులగమ శ్రీనివాసరెడ్డి, జీలకర్ర నాగేంద్ర, వానపల్లి ఈశ్వరరావు, విక్టర్‌, ఉమ్మడి కల్యాణ్‌, బల్ల శ్రీను, నాగేశ్వరరావు, నూకరాజు, ఎస్‌కే బాబ్జీ, మువ్వల సంతోష్‌, మధుసూదన్‌రెడ్డి, సంపంగి సురేష్‌, బద్రి, కృష్ణ, సంధ్య, మీసాల ప్రదీప్‌, కృప, బోని అప్పారవు, కార్యకర్తలు పాల్గొన్నారు.

వైఎస్సార్‌ సీపీ ఆధ్వర్యంలో

మన్యం వీరుడికి నివాళి

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement