నాకు 80 ఏళ్లు నిండాయి. కుటుంబ సభ్యులు దూరంగా ఉన్నా, మేం మర్చిపోయిన పుట్టినరోజులను తోటి వాకర్స్ గుర్తుచేసి మరీ వేడుకగా నిర్వహించడం ఎంతో ఉత్సాహాన్ని ఇస్తోంది. పదుల సంఖ్యలో స్నేహితుల మధ్య పుట్టినరోజు జరుపుకోవడం, ఇతరుల వేడుకల్లో పాల్గొనడం వల్ల మలిసంధ్యలోనూ ఎంతో ఆనందంగా ఉంది.
– నారాయణ స్వామి నాయుడు, జాతర వాక్స్ సభ్యుడు.
కొండంత బలం
పిల్లలు దూరంగా స్థిరపడటంతో ఇంట్లోనే ఒంటరిగా మిగిలిపోయిన మా లాంటి వారికి, ఈ సామూహిక పుట్టినరోజులు కొండంత బలాన్నిస్తున్నాయి. బయటకు చెప్పుకోలేని ఆవేదనను మరిపించి, జీవిత చరమాంకంలో కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. అందరి నడుమ ఆనందంగా గడపడం వల్ల మరికొన్నాళ్లు ఆరోగ్యంగా, హాయిగా జీవించగలమనే ధీమా కలుగుతోంది.
– నాగేశ్వరరావు, వాకర్స్ అసోసియేషన్ సభ్యుడు,
జీవితానికి భరోసానిస్తున్నాయి
జీవితం ముగిసిపోతోంది.. ఎలాగోలా కాలాన్ని నెట్టుకురావాలనే నైరాశ్యంలో ఉన్న మాకు, ఈ పుట్టినరోజు వేడుకలు కొత్త ఉత్సాహాన్ని నింపుతున్నాయి. మరికొన్ని ఏళ్లు హాయిగా, ఆనందంగా గడపగలమనే గట్టి భరోసాను ఈ వేడుకలు మాకు ఇస్తున్నాయి.
– గోవింద్, జాతర వాకర్స్ అసోసియేషన్ సభ్యుడు


