గణతంత్ర వేడుకలకు ఇద్దరు ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు
మద్దిలపాలెం: ఢిల్లీలో జరిగే గణతంత్ర దినోత్సవానికి ఏయూ పరిధిలోని ఇద్దరు ఎన్‌ఎస్‌ఎస్ వలంటీర్లు ప్రత్యేక అతిథులుగా ఎంపికయ్యారు. రాష్ట్రం మొత్తం మీద నలుగురు విద్యార్థులు ఈ అరుదైన గౌరవం దక్కించుకోగా, వారిలో ఇద్దరు ఏయూ పరిధిలోని విద్యార్థులు కావడం విశేషం. ఏయూ స్కూల్ ఆఫ్ ఇంటర్నేషనల్ బిజినెస్‌లో బీబీఏ చదువుతున్న కె.విజయ అంజనీ వర్ష, ఏక్యూజే పీజీ కాలేజీలో ఎంబీఏ చదువుతున్న కె.యోషువ అబ్రహం ఎంపికయ్యారు. వీరు తమ కుటుంబ సభ్యులతో కలిసి గణతంత్ర వేడుకల్లో పాల్గొంటారు. ఈ సందర్భంగా ఎంపికై న విద్యార్థులను ఏయూ వీసీ ఆచార్య జి.పి.రాజశేఖర్ గురువారం తన కార్యాలయంలో అభినందించారు. ఏయూ విద్యార్థులు జాతీయ స్థాయిలో ఎంపిక కావడం గర్వకారణమని ఆయన కొనియాడారు. కార్యక్రమంలో రెక్టార్ ఆచార్య పి.కింగ్, రిజిస్ట్రార్ ఆచార్య కె.రాంబాబు, డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ ఆచార్య ఎస్.హరనాథ్, ఎన్‌ఎస్‌ఎస్ కో–ఆర్డినేటర్ డి.సింహాచలం, ఏక్యూజే కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.సుధారాణి తదితరులు పాల్గొన్నారు.


