ఆర్‌టీఐహెచ్‌కు వీఎంఆర్‌డీఏ మద్దతు
విశాఖ సిటీ: మెట్రోపాలిటన్ కమిషనర్ ఎన్.తేజ్ భరత్ నేతృత్వంలో రాడిసన్ బ్లూ విశాఖ, గోకరాజు ఆదిత్యరాజు కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ (ఆర్‌టీఐహెచ్)కు ల్యాప్‌టాప్‌లు, ఇతర సామగ్రీ అందించారు. సిరిపురం జంక్షన్‌లో ది డెక్ భవనంలో ఉన్న ఆర్‌టీఐహెచ్ కార్యాలయాంలో జరిగిన కార్యక్రమంలో ఆర్‌టీఐహెచ్ సీఈఓ ఈశ్వరపు రవికి రాడిసన్ బ్లూ వైస్ ప్రెసిడెంట్ లత సమక్షంలో వీటిని అందజేశారు. ఈ సందర్భంగా మెట్రోపాలిటన్ కమిషనర్ తేజ్ భరత్ రాడిసన్ బ్లూ సంస్థ అందించిన మద్దతును ప్రశంసించారు. ప్రాంతీయంగా ఇన్నోవేషన్, స్టార్టప్‌లు, పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వ–ప్రైవేట్ భాగస్వామ్యాలు కీలక పాత్రను పోషిస్తాయన్నారు. ఆర్‌టీఐహెచ్‌కు వీఎంఆర్‌డీఏ తరఫున సహకారం ఎప్పుడూ ఉంటుందన్నారు. వీఎంఆర్‌డీఏ ఆధ్వర్యంలో రెండు ముఖ్యమైన ప్రాజెక్టులను ఆర్టిఫీషియల్ ఇంటెలిజెనన్స్‌తో అభివృద్ధి చేస్తున్నామని, వీటికి ఆర్‌టీఐహెచ్ సహకారం తీసుకొంటామని చెప్పారు. కార్యక్రమంలో వీఎంఆర్‌డీఏ జాయింట్ కమిషనర్ రమేష్, పర్యవేక్షక ఇంజినీర్ మధుసూదనరావు, కార్యనిర్వహక ఇంజనీర్ రామరాజు తదితరులు పాల్గొన్నారు.


