ముఖ్యమంత్రి సమీక్ష చేయాలి
10 వేల మంది స్టీల్ కార్మికులను తొలగించి, పనిభారం పెంచి, నాణ్యత లేకుండా సీఎండీ ప్లాంట్‌ని నడుపుతున్నారు. ప్లాంట్‌లో మొత్తం పనులను 42 ముక్కలుగా చేసి బయట కాంట్రాక్టులకు ఇవ్వడానికి కుట్రలు పన్నుతున్నారు. బయట కాంట్రాక్టర్లకు ఇవ్వడానికి సిద్ధం చేసిన టెండర్లలో వ్యయాన్ని విపరీతంగా పెంచారు. ప్లాంట్ నష్టాలకు కారకులెవరో తెలుసుకునేందుకు సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి మారేంత వరకూ విశాఖ ఉక్కు కోసం వివిధ రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాలు, ప్రజలు ఒత్తిడి పెంచాలని కోరుతున్నాం.
– ఆర్‌కేఎస్‌వీ కుమార్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి


