మధుర కలయిక | - | Sakshi
Sakshi News home page

మధుర కలయిక

Apr 2 2026 9:04 AM | Updated on Apr 2 2026 9:04 AM

మురళీనగర్‌ : నావల్‌ డాక్‌యార్డు అప్రెంటీస్‌ స్కూల్‌ పూర్వ విద్యార్థులు తమ గోల్డెన్‌ జూబ్లీ ఉత్సవాలను మురళీనగర్‌ వైశాఖి స్పోర్ట్సు పార్కులో బుధవారం నిర్వహించారు. 1976 బ్యాచ్‌కి చెందిన 100 మంది పూర్వ విద్యార్థులు ఒక చోట చేరి పాఠశాలలో గడిపిన క్షణాలను, మధుర జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. వివిధ హోదాల్లో రిటైర్‌ అయిన వీరు పకలరింపులతో పులకించిపోయారు. కమాండర్‌ తరుణయ్య, ఎన్‌ఎస్‌ ప్రకాశరావు, మెడికల్‌ ఆఫీసరుగా సేవలందించిన రవిబాబు పాల్గొన్నారు. వీరిని పూర్వ విద్యార్థులందరూ ఘనంగా సత్కరించారు. గోల్డెన్‌ జూబ్లీ మెమోంటోలను అందరికి అందించారు. మల్ల రామకృష్ణ ముఖ్య సమన్వయకర్తగా వ్యవహరించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన సంప్రదాయ నృత్యాలు అలరించాయి. ఏవీఎన్‌ పట్నాయక్‌, జి.పండయ్య, బ్రూస్లీ ప్రసాద్‌ పాల్గొని కార్యక్రమం నిర్వహణకు సహకరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement