ఆరోగ్యశ్రీకి కూటమి ఉరి | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యశ్రీకి కూటమి ఉరి

Apr 2 2026 8:58 AM | Updated on Apr 2 2026 8:58 AM

● నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో నిలిచిపోయిన సేవలు ● తీవ్ర ఇబ్బందుల్లో పేద రోగులు ● బకాయిలు చెల్లించకపోవడంతో సేవల నిలిపివేత: ఆషా

గీతంకు రెడ్‌ కార్పెట్‌.. ఏయూకి ఉరితాడు

ఏయూలో రక్షణ కోర్సులను రద్దు చేయడం వెనుక గీతం యూనివర్సిటీకి మేలు చేకూర్చాలనే ఉద్దేశం ఉందనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఏయూ వంటి ప్రతిష్టాత్మక ప్రభుత్వ సంస్థ ఈ కోర్సులను నిలిపివేస్తే, ఆ అడ్మిషన్లన్నీ సహజంగానే గీతం వంటి ప్రైవేటు సంస్థలకు మళ్లుతాయని పాలకులు భావిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఏయూని వీడి వెళ్లిన నిపుణులు గీతంలో కన్సల్టెంట్లుగా చేరుతుండటం, రక్షణ శాఖలు ఏయూని తమ భాగస్వామ్య జాబితా నుంచి తొలగించి ఇతర ప్రైవేటు సంస్థల వైపు చూడటం ఈ అనుమానాలకు బలం చేకూరుస్తోంది. విద్యార్థుల భవిష్యత్తు కంటే ఒక ప్రైవేటు సంస్థ లాభాలే ముఖ్యమన్నట్టుగా వర్సిటీ నిర్ణయాలు ఉండటం శోచనీయం.

మహారాణిపేట: నిరుపేదల ప్రాణ సంజీవని అయిన ఆరోగ్యశ్రీ పథకం నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో నిలిచిపోయింది. రెండు దశాబ్దాలుగా పేద రోగులకు కార్పొరేట్‌ ఆస్పత్రుల్లోనూ ఉచితంగా అందుతున్న ఆధునాతన వైద్య సేవలకు బకాయిల గ్రహణం పట్టింది. ఎన్నిసార్లు విన్నవించుకున్నా కోట్లాది రూపాయల మేర పేరుకుపోయిన బకాయిలను చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో.. జిల్లాలోని నెట్‌వర్క్‌ ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ కింద వైద్య సేవలు నిలిపివేయాలని ఏపీ స్పెషాలిటీ ఆస్పత్రుల అసోసియేషన్‌ (ఆషా) పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా బుధవారం ప్రధానంగా ఆస్పత్రుల్లో సేవలు బంద్‌ చేశారు. కేర్‌, వీఆర్‌ఐడీఏ, ఇండస్‌, జి.జె. తదితర ఆస్పత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. కేవలం అత్యవసర సేవలు మాత్రమే కొనసాగుతున్నాయి. జిల్లాలోని 65 నెట్‌వర్క్‌ ఆస్పత్రులకు ఎన్టీఆర్‌ వైద్య సేవల(ఆరోగ్యశ్రీ) కోసం ప్రతి రోజూ వెయ్యి మందికి పైగా అవుట్‌ పేషెంట్లు వస్తుంటారని అంచనా. ఒక్కో ఆస్పత్రిలో రోజుకు మూడు, నాలుగు సర్జరీలు జరుగుతుంటాయి. సమ్మె మొదటి రోజైన బుధవారం జిల్లావ్యాప్తంగా ఓపీ, ఐపీ సేవలు నిలిచిపోయాయి. అత్యవసర శస్త్రచికిత్సలు మినహా మిగిలిన సర్జరీలు కూడా ఆగిపోయాయి. ఉచిత వైద్య సేవలు నిలిపివేయడంతో పేద, మధ్యతరగతి ప్రజలు నిరాశగా వెనుదిరిగారు.

సేవల్లో తీవ్ర అంతరాయం

ఆషా పిలుపు మేరకు బుధవారం ఆరోగ్యశ్రీ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఎన్టీఆర్‌ ఆరోగ్యశ్రీ ట్రస్టు నుంచి బకాయిలు రాకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. దీని ప్రభావం కేవలం పేద రోగుల పైనే కాకుండా.. ఎంప్లాయీస్‌ హెల్త్‌ స్కీమ్‌(ఈహెచ్‌ఎస్‌) కింద చికిత్స పొందే ప్రభుత్వ, రిటైర్డ్‌ ఉద్యోగులు, వర్కింగ్‌ జర్నలిస్టులపైనా పడింది. బకాయిలు విడుదల చేసి సేవలు పునరుద్ధరించాలని రోగులు కోరుతున్నారు.

వర్సిటీలో పరిణామాలు ఆందోళనకరం

వర్సిటీలో జరుగుతున్న ఈ పరిణామాలు కేవలం విద్యాపరమైనవే కాకుండా, పరిపాలనాపరంగా కూడా వివాదాస్పదమవుతున్నాయి. ఇటీవల జరిగిన 91, 92వ కాన్వకేషన్‌ కార్యక్రమంలో గీతం యూనివర్సిటీ మాజీ వీసీ కోనేరు రామకృష్ణారావు అల్లుడు పూర్ణచంద్రరావును ముఖ్య అతిథిగా ఆహ్వానించడం పెద్ద దుమారం రేపింది. కనీసం పాలక మండలి దృష్టికి తీసుకువెళ్లకుండా, వారి అనుమతి లేకుండా వీసీ ఏకపక్షంగా వ్యవహరించడం చర్చనీయాంశమైంది. ప్రభుత్వ వర్సిటీని ప్రైవేటు వ్యక్తుల ఇలాకాగా మార్చేస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రూ.15 కోట్ల ఆదాయాన్ని ఇచ్చే సెంటర్‌ను మూసివేసి, వర్సిటీని ఆర్థికంగా దెబ్బతీయడం వెనుక ఉన్న అసలు రహస్యం ఏమిటో పాలకులు చెప్పాల్సిన అవసరం ఉందని వర్సిటీ వర్గాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

ఏయూ ఉనికికే ముప్పు

మేధావుల ఆవేదన..

విశాఖకు గర్వకారణంగా ఉన్న ఆంధ్ర విశ్వవిద్యాలయం తన ఉనికిని, గౌరవాన్ని కాపాడుకోవాలంటే ప్రస్తుత ధోరణి మారాలని విద్యావేత్తలు సూచిస్తున్నారు. రక్షణ రంగ నిపుణులను దూరం చేసుకోవడం వల్ల వర్సిటీ జాతీయ స్థాయి ర్యాంకింగ్‌ల్లో వెనుకబడే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారు. కేవలం ఒక ప్రైవేటు యూనివర్సిటీకి లబ్ధి చేకూర్చేందుకు ఏయూ మూలాలను దెబ్బతీయడం సరికాదని మేధావులు హెచ్చరిస్తున్నారు. తక్షణమే రక్షణ అధ్యయన కేంద్రాన్ని పునరుద్ధరించి, వర్సిటీ ప్రతిష్టను కాపాడాలని ఉత్తరాంధ్ర ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement