జైల్‌లో తాత్కాలిక ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు
ఆరిలోవ: విశాఖ కేంద్ర కారాగారం డ్రగ్ డి–అడిక్షన్ సెంటర్లో తాత్కాలిక ప్రాతిపదికన ఉద్యోగాల కోసం ఇంటర్వ్యూలు ముగిశాయి. ఇటీవల ఇక్కడ ప్రాజెక్టు కోఆర్డినేటర్, ఆకౌంటెంట్ కం క్లర్క్, మనస్తత్వవేత్త/కౌన్సెలర్, సామాజిక కార్యకర్త, నర్సు(పురుష), వార్డ్ బాయ్, పీర్ ఎడ్యుకేటర్ ఖాళీలను తాత్కాలిక ప్రాతిపదికన భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేశారు. 93 మంది దరఖాస్తు చేసుకున్నారు. వీరికి సోమ, మంగళవారాల్లో ఇంటర్వ్యూలు నిర్వహించినట్లు జైల్ పర్యవేక్షణాధికారి ఎం.మహేష్‌బాబు తెలిపారు. ఎంపిక జాబితా త్వరలో వెల్లడిస్తామన్నారు. ఈ నియామకాలకు జైల్ కోస్తాంధ్రా డీఐజీ ఎం.ఆర్.రవికిరణ్ చైర్మన్‌గా ప్రత్యేక కమిటీని నియమించినట్లు పేర్కొన్నారు. ఆయన పర్యవేక్షణలో ఇంటర్వ్యూలు జరిగాయన్నారు. ఇంట ర్వ్యూలో కమిటీ చైర్మన్‌తో పాటు సభ్యులుగా రాజమండ్రి సెంట్రల్ జైల్ పర్యవేక్షణాధికారి ఎస్.రాహుల్, విశాఖ కేంద్ర కారాగారం పర్యవేక్షణాధికారి ఎం.మహేష్‌బాబు, విశాఖ ప్రభుత్వ మానసిక వైద్యశాల పర్యవేక్షణాధికారి డాక్టర్ కె.వి.రామిరెడ్డి, ఏఎంసీ ప్రొఫెసర్ డాక్టర్ జి.వాసవి లత, జిల్లా సబ్‌జైల్ అధికారి జి.వెంకటరమణ పాల్గొన్నారు.


