జైలును సందర్శించిన డీఐజీ రవికిరణ్
ఆరిలోవ: విశాఖ కేంద్ర కారాగారాన్ని కోస్తాంధ్ర డీఐజీ ఎంఆర్ రవికిరణ్ మంగళవారం సందర్శించారు. ఇక్కడ జైల్ సూపరింటెండెంట్ ఎం.మహేష్‌బాబు, అధికారులతో కలసి జైల్‌లో ఖైదీలు ఉండే బేరక్‌లు, వంటశాల, ఆస్పత్రిని ఆయన పరిశీలించారు. ఖైదీలతో మాట్లాడి మెనూ ప్రకారం ఆహారం అందిస్తున్నారా? వైద్య సేవలు సక్రమంగా అందు తున్నాయా? అని ఆరా తీశారు. ఖైదీలతో వారి బంధువులు మాట్లాడడానికి ఏర్పాటు చేసిన ములాఖత్ గదిని పరిశీలించారు. అనంతరం జైల్ రికార్డులు పరిశీలించి, సిబ్బంది పనితీరుపై ఆరా తీశా రు. ఖైదీల్లో మంచి మార్పు తీసుకురావడానికి కృషి చేయాలని సూచించారు. జైల్ అభివృద్ధి, విధి నిర్వహణలో సిబ్బందికి సమస్యలు తలెత్తకుండా చూసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం జైల్‌లో డ్రగ్ డి–అడిక్షన్ సెంటర్‌లో తాత్కాలిక పోస్టుల కోసం జరిగిన ఇంటర్వ్యూలను పర్యవేక్షించారు.


