బీచ్‌రోడ్డులో డబుల్ డెక్కర్ ఓపెన్ టాప్ బస్
సాక్షి, విశాఖపట్నం: సాగర తీరంలో మరో డబుల్ డెక్కర్ బస్ చక్కర్లు కొట్టనుంది. ఇప్పటికే రెండు హిప్ హాప్ బస్సులు తీరంలో తిరుగుతుండగా... ఇప్పుడు మూడో బస్సును పర్యాటక శాఖ సిద్ధం చేసింది. మొదటి రెండు బస్సులతో పోలిస్తే ఇది ప్రత్యేకం. ఎందుకంటే ఇది ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్. విశాఖపట్నం పోర్ట్ అథారిటీ నిధులతో ఏపీటీడీసీ ఈ బస్సును సిద్ధం చేసింది. త్వరలోనే జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా పర్యాటకుల కోసం ఈ సరికొత్త ఓపెన్ టాప్ డబుల్ డెక్కర్ బస్సును ప్రారంభిస్తామని ఏపీటీడీసీ డివిజనల్ మేనేజర్ జీవీబీ జగదీష్ తెలిపారు.


