నేవీ ప్రాజెక్ట్స్ డీజీగా వైస్ అడ్మిరల్ శ్రీనివాస్ బ
సింధియా: నేవీ ప్రాజెక్ట్స్ డైరెక్టర్ జనరల్‌గా వైస్ అడ్మిరల్ కె.శ్రీనివాస్ ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. 1990 జనవరి 1న భారత నావికాదళంలో ప్రవేశించిన ఆయన కోరుకొండ సైనిక్ స్కూల్, నేషనల్ డిఫెన్స్ అకాడమీ పూర్వ విద్యార్థి. 35 ఏళ్లకుపైగా భారత నావికాదళంలో విస్తృత సేవలందించిన ఆయన విమాన వాహక నౌక ఐఎన్‌ఎస్ విరాట్‌లోనూ పనిచేశారు. రష్యాలోని సెవెరోడ్విన్స్య్‌లో యుద్ధనౌక తయారీకి సూపరింటెండెంట్‌గా కూడా వ్యవహరించారు. ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య నౌక మరమ్మతులను పర్యవేక్షించే బాధ్యత చూశారు. న్యూఢిల్లీలోని నేవల్ హెడ్ క్వార్టర్స్‌లో ప్రీమియర్ కమాండ్‌గా బాధ్యతలు స్వీకరించే ముందు ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ ప్రాజెక్ట్స్ డైరెక్టర్‌గా, ఫ్లీట్ మెయింటెనెన్స్ ప్రిన్సిపాల్ డైరెక్టర్‌గా కూడా పని చేశారు.


