ఏపీటీయూ గౌరవాధ్యక్షుడిగా ఎంపీ గొల్ల బాబూరావు | - | Sakshi
Sakshi News home page

ఏపీటీయూ గౌరవాధ్యక్షుడిగా ఎంపీ గొల్ల బాబూరావు

Nov 3 2025 9:43 AM | Updated on Nov 3 2025 9:43 AM

ఏపీటీయూ గౌరవాధ్యక్షుడిగా ఎంపీ గొల్ల బాబూరావు

ఏపీటీయూ గౌరవాధ్యక్షుడిగా ఎంపీ గొల్ల బాబూరావు

సీతంపేట: ఆంధ్రప్రదేశ్‌ టీచర్స్‌ యూనియన్‌(ఏపీటీయూ) రాష్ట్ర గౌరవాధ్యక్షుడిగా రాజ్యసభ సభ్యుడు గొల్ల బాబూరావు ఏకగీవ్రంగా ఎన్నికయ్యారు. ఏపీటీయూ రాష్ట్ర అధ్యక్షుడు వై.దేముడు ఆధ్వర్యంలో ఆదివారం అక్కయ్యపాలెంలో కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన్ని యూనియన్‌ కార్యవర్గ సభ్యులు ఘనంగా సత్కరించారు. అనంతరం ఎంపీ మాట్లాడుతూ యూనియన్‌ అభివృద్ధికి తనవంతు కృషి చేస్తానన్నారు. విద్యారంగం, సమాజం, ఉపాధ్యాయ సమస్యలపై పరిపూర్ణమైన అవగాహన ఉన్న గొల్ల బాబూరావు యూనియన్‌ గౌరవాధ్యక్షుడిగా నాయకత్వం వహించేందుకు అంగీకారం తెలపడం పట్ల కార్యవర్గం కృతజ్ఞతలు తెలిపింది. రాష్ట్ర నాయకులు , జి.దత్తాత్రేయ శర్మ, కె.బ్రహ్మారెడ్డి, కె.జె.కృపానందం, గౌరీ శంకర్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement