
మత్స్య సంపద నాణ్యత, మార్కెటింగ్ మెరుగుదలపై దృష్టి
మహారాణిపేట: సంప్రదాయ మత్స్యకారుల అవసరాలు, సుస్థిర వేట విధానాలపై అవగాహన పెంచే లక్ష్యంతో సెంట్రల్ మైరెన్ ఫిషరీస్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ విశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి సంప్రదింపుల వర్క్‌షాప్ విజయవంతంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ ఎం.ఎన్. హరేందిర ప్రసాద్ హాజరై ప్రసంగించారు. మత్స్య సంపద నాణ్యత, మార్కెటింగ్ మెరుగుదలపై దృష్టి సారించాలని సూచించారు. ఈ సందర్భంగా సముద్ర సంపద పరిరక్షణలో కీలక పాత్ర పోషిస్తున్న మత్స్యకారులను కలెక్టర్ ‘నీలి యోధులు’గా అభివర్ణించి, వారిని ఘ నంగా సన్మా నించారు. మత్స్యశాఖ జాయింట్ డైరెక్టర్ పి. లక్ష్మణ రావు, ప్రధాన శాస్త్రవేత్తలు శాస్త్రవేత్తలు డాక్టర్ కిజకుడన్, డాక్టర్ మధుసూదన రావు, డాక్టర్ మీనా, ఎంపీడా డీడీ మహంతి సహా ఇతర సీఎమ్‌ఎఫ్‌ఆర్‌ఐ శాస్త్రవేత్తలు, అధికారులు పాల్గొన్నారు.