
వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ‘కోటి సంతకాల ఉద
సాక్షి, విశాఖపట్నం: ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేయాలనే కూటమి ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల ప్రజా ఉద్యమం చేపట్టింది. ఈ ఉద్యమంలో మేధావి వర్గాలు, ప్రజా సంఘాలు, వివిధ రాజకీయ పార్టీలు, ప్రజలు పాల్గొనాలని పార్టీ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు కోరారు. మద్దిలపాలెం పార్టీ కార్యాలయంలో విశాఖ ఉత్తర నియోజకవర్గం పోస్టర్‌ను ఆవిష్కరించిన సందర్భంగా కేకే రాజు మాట్లాడుతూ... ప్రజల ఆరోగ్య హక్కులను కాపాడేందుకు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు అప్పగించే కుట్రలను అడ్డుకునేందుకు ఈ ఉద్యమం రాష్ట్రవ్యాప్తంగా జరుగుతోందన్నారు. ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని మెడికల్ కళాశాల నిర్మాణాలను కొనసాగించే వరకు ఉద్యమం ఆగదని హెచ్చరించారు. కేంద్రంలోని బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో ఎక్కడా వైద్య కళాశాలలను ప్రైవేటుకు అప్పగించలేదని గుర్తు చేస్తూ.. బీజేపీ సిద్ధాంతాలకు విరుద్ధంగా ముఖ్యమంత్రి చంద్రబాబుకు తొత్తుగా పనిచేస్తున్నారంటూ రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్‌పై కేకే రాజు విమర్శలు గుప్పించారు. అంతేకాకుండా ఈ ప్రభుత్వంలో వసతిగృహాల్లోని విద్యార్థులకు కూడా సరైన భోజనం, తాగునీరు అందించలేని పరిస్థితి ఉందని మండిపడ్డారు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ కె. సతీష్, జీవీఎంసీ ఫ్లోర్ లీడర్ బాణాల శ్రీనివాసరావు, డిప్యూటీ ఫ్లోర్ లీడర్ అల్లు శంకరరావు, స్టాండింగ్ కమిటీ మెంబర్ సాడి పద్మారెడ్డి, కార్పొరేటర్లు కె.అనిల్ కుమార్ రాజు, రెయ్యి వెంకటరమణ, బర్కత్ అలీ, శశికళ, కో–ఆప్షన్ సభ్యులు సేనాపతి అప్పారావు, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిరణ్ రాజు, ఎస్‌ఈసీ మెంబర్ పీలా వెంకటలక్ష్మి, వలంటరీ విభాగం జోనల్ ప్రెసిడెంట్ ఎం.సునీల్, జిల్లా అనుబంధ విభాగం అధ్యక్షులు నీలి రవి, రామిరెడ్డి, వార్డు అధ్యక్షుడు గుజ్జు వెంకటరెడ్డి, పైడి రమణ, బొడ్డేటి కిరణ్, బలిరెడ్డి గోవింద్, కె.సుకుమార్, మాజీ కార్పొరేటర్ దల్లి రామకృష్ణా రెడ్డి, నియోజకవర్గ అనుబంధ సంఘాల అధ్యక్షులు పాల్గొన్నారు