
బదిలీపై వెళ్తున్న విశ్వనాథన్‌కు ఘన సత్కారం
తాటిచెట్లపాలెం: రాష్ట్ర సమాచార, ప్రజా సంబంధ శాఖ డైరెక్టర్‌గా బదిలీపై వెళ్తున్న వీఎంఆర్‌డీఏ మెట్రోపాలిటన్ కమిషనర్ కేఎస్ విశ్వనాథన్‌ను కలెక్టర్ హరేందిర ప్రసాద్, వీఎంఆర్‌డీఏ చైర్మన్ ప్రణవ్ గోపాల్ శనివారం ఘనంగా సత్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ విశ్వనాథన్ విశాఖ నగర అభివృద్ధికి ఎంతో కృషి చేశారని, ముఖ్యంగా ప్రజాప్రతినిధులతో సమ న్వయం చేసుకుంటూ ఆయన చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు గొప్పవని కొనియాడారు. కేఎస్ విశ్వనాథన్ మా ట్లాడుతూ.. విశాఖలో పనిచేయడం గొప్ప అనుభూతిని ఇచ్చిందన్నారు. కార్యక్రమంలో వీఎంఆర్‌డీఏ జాయింట్ కమిషనర్ రమేష్, కార్యదర్శి మురళీకృష్ణ, ప్రధాన ఇంజినీర్ వినయ్‌కుమార్, ఎస్టేట్ అధికారి దయానిధి, పర్యవేక్షక ఇంజినీర్లు భవాని శంకర్, మధుసూధనరావు, ముఖ్య ప్రణాళికాధికారిణి శిల్ప, ముఖ్య గణాంకాధికారి హరిప్రసాద్ పాల్గొన్నారు.