
‘గ్లో అప్ గాల’..మిలమిల
బీచ్‌రోడ్డు: విశాఖలో తొలిసారిగా నిర్వహించిన ‘గ్లో అప్ గాల’ మేకప్ అవార్డ్స్, మెగా మోడలింగ్ ఈవెంట్ శనివారం మిరిమిట్లు గొలిపే విద్యుత్ వెలుగుల్లో ఆకట్టుకుంది. రాష్ట్రం నలుమూలల నుంచి విచ్చేసిన సుమారు 30 మంది మోడల్స్.. ఇండియన్ బ్రైడ్స్, లెహెంగాస్, వెస్ట్రన్ గౌన్స్, వన్ మినిట్ శారీస్‌లో ర్యాంప్‌పై మెరిశారు. న్యాయ నిర్ణేతలుగా మిస్ ఇండియా యూనివర్స్ హేమల తా రెడ్డి, మిస్ ఒడిశా సుప్రియ, మిస్ ఆంధ్ర సరిత, అంతర్జాతీయ మోడల్ కోచ్ రోహిత్ సువ్వాడ వ్యవహరించారు.