
డిసెంబరు 19 నుంచి క్రెడాయి ఎక్స్‌పో
బీచ్‌రోడ్డు: ఎంవీపీకాలనీలోని గాదిరాజు ప్యాలెస్‌లో డిసెంబరు 19 నుంచి మూడు రోజుల పాటు క్రెడాయ్ 11వ ప్రాపర్టీ ఎక్స్‌పో నిర్వహించనున్నారు. క్రెడాయ్ విశాఖ చైర్మన్ ధర్మేందర్ వరదా, అధ్యక్షుడు ఈ.అశోక్ కుమార్, కార్యదర్శి వి.శ్రీను, సంయుక్త కార్యదర్శి/కార్యక్రమ కన్వీనర్ సీహెచ్.గోవిందరాజు నగరంలోని ఒక హోటల్‌లో శనివారం మీడియాకు ఈ వివరాలను వివరించారు. ఈసారి కూడా బ్యాంకులు రుణాలిచ్చేందుకు ముందుకొచ్చాయని, వినియోగదారుల సౌకర్యార్థం నిర్మాణ సామగ్రి, అధునాతన ఇంటీరియర్ తదితర వివరాలను ఈ ఎక్స్‌పో ద్వారా తెలుసుకోవచ్చన్నారు. కేంద్ర ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చిన జీఎస్టీ 2.0 వల్ల వినియోగదారులకు ఎంతో ఉపయోగం ఉంటుందని క్రెడాయ్ ప్రతినిధులు తెలిపారు. సిమెంట్‌పై 28 శాతం నుంచి 18 శాతానికి జీఎస్టీ తగ్గించడం వల్ల ధరలు తగ్గే అవకాశం ఉన్నప్పటికీ.. కంపెనీలు ధరల్ని పెంచి జీఎస్టీ తగ్గించామని చూపిస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.