
ఐఎన్‌ఎస్ కళింగలో సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య
కొమ్మాది: బీచ్ రోడ్డులోని ఐఎన్‌ఎస్ కళింగలో శనివారం సాయంత్రం ఒక సెక్యూరిటీ గార్డు ఆత్మహత్య చేసుకున్నాడు. గుంటూరుకు చెందిన బాజీ బాబా సాహిక్ (44) ఇక్కడ డిఫెన్స్ సెక్యూరిటీ కోర్ గార్డుగా విధులు నిర్వహిస్తున్నారు. అతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. కాగా.. సాహిక్ తన వద్దనున్న సర్వీస్ తుపాకీతో గొంతు వద్ద కాల్చుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే ఆయన ఆత్మహత్యకు గల కారణాలు, ఇతర వివరాలు ఇంకా తెలియరాలేదు. నేవీ అధికారులు ఫిర్యాదు మేరకు భీమిలి సీఐ తిరుమలరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.