పేదల గుండెచప్పుడు వైఎస్సార్‌ | - | Sakshi
Sakshi News home page

పేదల గుండెచప్పుడు వైఎస్సార్‌

Sep 3 2025 4:01 AM | Updated on Sep 3 2025 9:16 AM

వైఎస్

వైఎస్సార్‌

● మహానేత ఆశయాలకనుగుణంగానే వైఎస్‌ జగన్‌ హయాంలో పాలన ● వైఎస్సార్‌ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి

సాక్షి, విశాఖపట్నం : అభివృద్ధి, సంక్షేమంతో పేదల తలరాత మార్చిన మహానేత వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి అని వైఎస్సార్‌ సీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌ కొనియాడారు. ఉమ్మడి విశాఖపై వైఎస్సార్‌ అందించిన అభివృద్ధి ముద్రలు ఎప్పటికీ చెరగనివని కొనియాడారు. జిల్లా సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు మారుతి ప్రసాద్‌ ఆధ్వర్యంలో మంగళవారం మద్దిలపాలెంలో గల పార్టీ కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి 16వ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేద మహిళలకు చీరలు పంపిణీ చేశారు. అనంతరం విశాఖ తూర్పు సమన్వయకర్త మొల్లి అప్పారావు ఆధ్వర్యంలో బీచ్‌రోడ్డులో గల వైఎస్సార్‌ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అక్కడ రక్తదాన శిబిరాన్ని ప్రారంభించారు. రక్తదానం చేసిన వారిని అభినందించారు. 

ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు కె.కె.రాజు, మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్‌కుమార్‌, సమన్వయకర్తలు మొల్లి అప్పారావు, తిప్పల దేవన్‌రెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్‌ చేసిన మంచి కార్యక్రమాలు ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్‌మెంట్‌, ఉచిత విద్యుత్‌, 108, 104 అంబులెన్స్‌లు, జలయజ్ఞం వంటి ఎన్నో గొప్ప కార్యక్రమాలను చేపట్టారన్నారు. గత ప్రభుత్వ హయాంలో వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి తండ్రి ఆశయాలను మరింత ముందుకు తీసుకెళ్లారని కొనియాడారు. సమావేశంలో మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు, మాజీ ఎమ్మెల్యేలు తిప్పల నాగిరెడ్డి, తైనాల విజయకుమార్‌, తిప్పల గురుమూర్తిరెడ్డి, డిప్యూటీ మేయర్‌ కట్టమూరి సతీష్‌, పార్టీ కార్యాలయం పర్యవేక్షకుడు రవి రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాజీవ్‌, రాష్ట్ర అనుబంధ విభాగాల అధ్యక్షులు జాన్‌ వెస్లీ, పేర్ల విజయ చంద్ర, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు పేడాడ రమణకుమారి, రీజినల్‌ యువజన విభాగం అధ్యక్షుడు అంబటి శైలేష్‌, ముఖ్యనేతలు రొంగలి జగన్నాథం, వుడా రవి, నడింపల్లి కృష్ణంరాజు, డాక్టర్‌ జహీర్‌ అహ్మాద్‌, సతీష్‌వర్మ, పి.రవిరాజు, కార్పొరేటర్లు బానాల శ్రీనివాసరావు, అల్లు శంకరరావు, కె.అనిల్‌కుమార్‌ రాజు, స్వాతి దాస్‌, బర్కత్‌ అలీ, శశికళ, పద్మారెడ్డి, బిపిఎన్‌ కుమార్‌ జైన్‌, పార్టీ నాయకులు బోని శివరామకృష్ణ, అల్లంపల్లి రాజుబాబు, రామన్న పాత్రుడు,తాడి జగన్నాథ రెడ్డి, బోని బంగారునాయుడు, సనపల రవీంద్ర భరత్‌, సేనాపతి అప్పారావు, శ్రీదేవి వర్మ, రాధ, సకలభక్తుల ప్రసాద్‌, రామిరెడ్డి, దిలీప్‌ కుమార్‌, బోండా ఉమామహేశ్వరరావు, జిలకర్ర నాగేంద్ర, దేవరకొండ మార్కెండేయులు, నీలి రవి, మువ్వల సురేష్‌, పల్లా దుర్గ, మంచ మల్లేశ్వేరి, బొండా శ్రీను, తదితరలు పాల్గొన్నారు.

వైఎస్సార్‌1
1/2

వైఎస్సార్‌

వైఎస్సార్‌2
2/2

వైఎస్సార్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement