
అదరగొట్టిన దబాంగ్ ఢిల్లీ
దుమ్మురేపిన పాంథర్స్
విశాఖ స్పోర్ట్స్ : ప్రో కబడ్డీ పన్నెండో సీజన్‌లో తమ తొలి మ్యాచ్‌లో దబాంగ్ ఢిల్లీ అదరగొట్టింది. పోర్ట్ ఇండోర్ స్టేడియంలో మంగళవారం జరిగిన ఉత్కంఠభరిత పోరులో దబాంగ్ ఢిల్లీ 41–34 పాయింట్ల తేడాతో బెంగళూరు బుల్స్‌పై విజయం సాధించింది. ఢిల్లీ కెప్టెన్ ఆశు మాలిక్ 15 పాయింట్లతో అద్భుతంగా రాణించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. రైడర్ నీరజ్ 7 పాయింట్లతో అతనికి సహకరించాడు. మరో మ్యాచ్‌లో జైపూర్ పింక్ పాంథర్స్ జట్టు తొలి మ్యాచ్‌లో పాట్నా పైరేట్స్‌పై 39–36 తేడాతో విజయం సాధించింది. జైపూర్ తరఫున నవీన్ 13 పాయింట్లు సాధించి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు. పాట్నా పైరేట్స్ తరఫున మనీందర్ 15 పాయింట్లతో రాణించినా, వారి జట్టు వరుసగా రెండో మ్యాచ్‌లో ఓడిపోయింది.