
అభివృద్ధి పనులపై సమీక్ష
తాటిచెట్లపాలెం : ఈస్ట్ కోస్ట్ రైల్వే ప్రిన్సిపల్ చీఫ్ కమర్షియల్ మేనేజర్ (పీసీసీఎం) రీటా రాజ్ బుధవారం విశాఖపట్నం రైల్వేస్టేషన్‌లో పర్యటించారు. రీటారాజ్ పీసీసీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా విశాఖలో పర్యటించారు. ప్రయాణికుల సౌకర్యాలు, వసతులు, అభివృద్ధి పనులను పరిశీలించారు. ముందుగా దొండపర్తిలో గల డివిజినల్ రైల్వే మేనేజర్ కార్యాలయంలో డీఆర్‌ఎం లలిత్ బోహ్ర, ఇతర ఉన్నతాధికారులతో ఆమె సమావేశమయ్యారు. కమర్షియల్ విభాగానికి చెందిన పలు అంశాలు, నాన్‌ఫేర్ రెవెన్యూకు సంబంధించిన ప్రాజెక్టులపై చర్చించారు. సీనియర్ డివిజినల్ కమర్షియల్ మేనేజర్ కె.సందీప్ డివిజన్ పరిధిలో ప్రస్తుతం జరుగుతున్న అభివృద్ధి పనులు, భవిష్యత్ ప్రణాళికలను వివరించారు. సమావేశంలో వాల్తేర్ డివిజన్ కమర్షియల్, ట్రాఫిక్ విభాగాల సీనియర్ అధికారులు పాల్గొన్నారు.