
ప్రతి నెలా మూడో శనివారం ప్రవేశం
విద్యార్థుల సందర్శనకు
హెర్బేరియం, మ్యూజియం సిద్ధం
మద్దిలపాలెం: ఏయూలోని వృక్షశాస్త్ర విభాగంలో ఉన్న మ్యూజియం, హెర్బేరియంలను ఇకపై విద్యార్థులు, పరిశోధకులు సందర్శించవచ్చు. గురువారం ఈ కార్యక్రమాన్ని ఏయూ ఉపకులపతి ఆచార్య జి.పి. రాజశేఖర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన పోస్టర్ ఆవిష్కరించారు. ప్రతి నెల మూడో శనివారం విద్యార్థులు, పరిశోధకులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు, వృక్షశాస్త్రంలో ఆసక్తి ఉన్నవారు సందర్శించవచ్చని వీసీ చెప్పారు. అంతరించి పోతున్న, అరుదైన వృక్ష జాతుల సమాచారం తెలుసుకోవచ్చని, ఇది పాఠశాల, కళాశాల విద్యార్థులకు ప్రత్యేక ప్రయోగశాలగా ఉపయోగపడుతుం దన్నారు. ఈ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని వీసీ కోరారు.