
టైటాన్స్‌కు తొలి విజయం
విశాఖ స్పోర్ట్స్ : పోర్ట్ ఇండోర్ స్టేడియంలో జరిగిన ప్రో కబడ్డీ మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. జైపూర్ పింక్ పాంథర్స్‌తో జరిగిన ఉత్కంఠభరితమైన పోరులో 37–32 తేడాతో విజయం సాధించింది. టైటాన్స్ కెప్టెన్ విజయ్, ఆల్‌రౌండర్ భరత్ ఎనిమిది పాయింట్లతో రాణించగా, రైడర్లు చేతన్, అజిత్ ఐదేసి పాయింట్లు సాధించారు. గత రెండు మ్యాచ్‌లలో ఓటమి తర్వాత, ఈ విజయం టైటాన్స్‌కు పాయింట్ల ఖాతాను తెరిచింది.
దబాంగ్ ఢిల్లీకి హ్యాట్రిక్ విజయం : మరో మ్యాచ్‌లో, దబాంగ్ ఢిల్లీ హోరాహోరీగా తలపడిన పునేరి పల్టన్‌ను గోల్డెన్ రైడ్‌లో ఓడించింది. మ్యాచ్ 28–28తో డ్రా కావడంతో, గోల్డెన్ రైడ్ ద్వారా విజేతను నిర్ణయించారు. స్టార్ రైడర్ ఆషు మాలిక్ సాధించిన రెండు పాయింట్లతో దబాంగ్ ఢిల్లీ 30–28 తేడాతో గెలిచి, ఈ సీజన్‌లో హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకుంది. పునేరి పల్టన్ తరఫున ఆదిత్య ఏడు పాయింట్లు సాధించగా, దబాంగ్ ఢిల్లీ కెప్టెన్ ఆషు సూపర్ టెన్ సాధించాడు.