కొత్త లాండ్రీ సదుపాయం ప్రారంభం | - | Sakshi
Sakshi News home page

కొత్త లాండ్రీ సదుపాయం ప్రారంభం

Sep 5 2025 5:48 AM | Updated on Sep 5 2025 5:48 AM

కొత్త లాండ్రీ సదుపాయం ప్రారంభం

కొత్త లాండ్రీ సదుపాయం ప్రారంభం

తాటిచెట్లపాలెం : ఆటోనగర్‌లోని అల్ట్రావాష్‌ టెక్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌లో కొత్త సదుపాయాన్ని వాల్తేరు రైల్వే డివిజన్‌ డివిజనల్‌ రైల్వే మేనేజర్‌ లలిత్‌ బోహ్రా గురువారం ప్రారంభించారు. రైల్వే బెడ్‌రోల్స్‌, లెనిన్‌లను శుభ్రం చేయడానికి అధునాతన మెషినరీతో కూడిన స్టీమ్‌ బాయిలర్‌ ను ఈ సంస్థలో అందుబాటులోకి తీసుకువచ్చారు. ఈ సందర్భంగా డీఆర్‌ఎం యూనిట్‌లోని బెడ్‌షీట్‌ క్యాలెండరింగ్‌, ఫోల్డింగ్‌ మెషిన్‌, వాషర్‌ ఎక్స్‌ట్రాక్టర్స్‌ వంటి వివిధ విభాగాల పనితీరును పరిశీలించారు. అల్ట్రావాష్‌ టెక్స్‌ సంస్థ గత 14 ఏళ్లుగా విశాఖపట్నం ప్రాంతంలో రైల్వేలకు లాండ్రీ , డ్రై క్లీనింగ్‌ సేవలను అందిస్తోంది. ఈ యూనిట్‌ ఒక షిఫ్ట్‌లో 7.5 టన్నుల వస్త్రాలను శుభ్రపరిచే సామర్థ్యం కలిగి ఉంది. అల్ట్రా గ్రూప్‌ చైర్మన్‌, మేనేజింగ్‌ డైరెక్టర్‌ ఎల్‌.జి. త్రినాథరావు, డైరెక్టర్‌ ఎల్‌. సాయి వందన అందించిన సేవలను డీఆర్‌ఎం ఈ సందర్భంగా ప్రశంసించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement