
ఉత్తరాంధ్ర మైనార్టీ విద్యాభివృద్ధి డీడీగా ఖాజా రహమతుల్ల
మద్దిలపాలెం: ఉత్తరాంధ్ర ప్రాంతీయ మైనార్టీ విద్యాఅభివృద్ధి డిప్యూటీ డైరెక్టర్ (డీడీ)గా డాక్టర్ ఖాజా రహమతుల్లా నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఉత్తరాంధ్ర మైనార్టీల విద్య, ఉద్యోగ శిక్షణకు సంబంధించిన కార్యక్రమాలను ఈ సంస్థ ప్రభుత్వ సహకారంతో నిర్వహిస్తుంది. ప్రస్తుతం ఆంధ్రా యూనివర్సిటీ ఉన్నత పాఠశాలలో పనిచేస్తున్న డాక్టర్ ఖాజా, వినియోగదారుల సంరక్షణ కమిటీ సభ్యుడిగా, గతంలో ప్రధానమంత్రి 15 అంశాల జిల్లా కమిటీ సభ్యుడిగా కూడా సేవలందించారు. ఈ పదవికి అవకాశం కల్పించినందుకు ఏయూ వీసీ ఆచార్య రాజశేఖర్, రిజిస్ట్రార్ ఆచార్య రాంబాబు, పాఠశాల హెచ్‌ఎంకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు.