
అప్పలరాజుకు రాంపాల్ సింగ్ ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం
తగరపువలస: అఖిల భారత ప్రాథమిక ఉపాధ్యాయ సమాఖ్య మాజీ అధ్యక్షుడు రాంపాల్ సింగ్ పేరుమీద నెలకొల్పిన జాతీయ ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు భీమిలి జోన్ ఒకటోవార్డు సంతపేట అంబేడ్కర్ జీవీఎంసీ హైస్కూల్‌కు చెందిన ఉపాధ్యాయుడు రెడ్డిపల్లి అప్పలరాజు ఎంపికయ్యారు. ఉత్తరప్రదేశ్ బందాలోని రాంపాల్‌సింగ్ ఉత్తమ ఉపాధ్యాయ సెలక్షన్ కమిటీ ఫౌండేషన్ ప్రధానకార్యదర్శి ప్రేమ్‌కుమార్ సింగ్ ఈ మేరకు సమాచారం అందించారు. అప్పలరాజుకు ఈ నెల 22న బందాలో మొమెంటో, సర్టిఫికెట్, నగదు బహుమతి అందించనున్నారు. సాయి సంహిత ఫౌండేషన్ ద్వారా సేవా కార్యక్రమాలు చేస్తున్న అప్పలరాజును పలువురు ఉపాధ్యాయులు అభినందించారు.