
ఈఎన్‌సీలో హిందీ పక్షోత్సవాలు ప్రారంభం
సింథియా: తూర్పు నావికాదళ ప్రధాన కార్యాలయంలో సెప్టెంబర్ 2 నుంచి 17వ తేదీ వరకు నిర్వహించనున్న హిందీ పక్షోత్సవాలను చీఫ్ స్టాఫ్ ఆఫీసర్ (పర్సనల్ అండ్ అడ్మినిస్టేషన్) అడ్మిరల్ మురళీమోహన్‌రాజు ప్రారంభించారు. వేడుకల్లో భాగంగా హిందీ పోటీలు, వర్క్‌షాపులతో సహా పలు కార్యకలాపాలు నిర్వహించనున్నట్లు నేవీ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 17న సంస్థ హిందీ మ్యాగజైన్ పూర్వి వాణి 31వ ఎడిషన్ ఆవిష్కరణతో వేడుకలు ముగుస్తాయని పేర్కొంది. ప్రారంభ వేడుకల్లో తూర్పు నావికాదళ పరిధిలోని వివిధ నౌకల సిబ్బంది, పలు సంస్థల పౌర సిబ్బంది పాల్గొన్నారు.