పలు రైళ్లు రద్దు, రీ షెడ్యూల్‌

- - Sakshi

తాటిచెట్లపాలెం: భద్రత, ఆధునికీకరణ పనుల కారణంగా విశాఖపట్నం నుంచి, విశాఖపట్నం మీదుగా రాకపోకలు సాగించే పలు రైళ్లు ఆయా తేదీల్లో రద్దు చేశారు. మరికొన్ని రీషెడ్యూల్‌ చేస్తున్నట్లు వాల్తేర్‌ సీనియర్‌ డివిజనల్‌ కమర్షియల్‌ మేనేజర్‌ ఎ.కె.త్రిపాఠి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 3న విశాఖపట్నం–రాయ్‌పూర్‌(08527/08528) పాసింజర్‌ స్పెషల్‌ ఇరువైపులా రద్దయింది.

 షెడ్యూల్‌ చేసిన రైళ్లు

ఈ నెల 3న విశాఖపట్నం–హజరత్‌ నిజాముద్దీన్‌ (12807) సమతా ఎక్స్‌ప్రెస్‌ విశాఖలో గంట ఆలస్యంగా బయలుదేరుతుంది.

ఈ నెల 3న అమృత్‌సర్‌–విశాఖపట్నం (20808) హిరాకుడ్‌ సూపర్‌ఫాస్ట్‌ ఎక్స్‌ప్రెస్‌ అమృత్‌సర్‌లో 5 గంటలు ఆలస్యంగా బయలుదేరుతుంది.

ఈ నెల 4న సికింద్రాబాద్‌–భువనేశ్వర్‌(17016) విశాఖ ఎక్స్‌ప్రెస్‌ సికింద్రాబాద్‌లో 4 గంటలు ఆలస్యంగా బయలుదేరుతుంది.

ఈ నెల 4న చైన్నె సెంట్రల్‌–హౌరా (12840) మెయిల్‌ చైన్నె సెంట్రల్‌లో 4 గంటలు ఆలస్యంగా బయలుదేరుతుంది.

ఈ నెల 4న వాస్కోడగామా–షాలిమార్‌ (18048) అమరావతి ఎక్స్‌ప్రెస్‌ వాస్కోడగామాలో 4 గంటలు ఆలస్యంగా బయలుదేరుతుంది.

గమ్యం కుదించిన రైళ్లు

విశాఖపట్నం–కిరండూల్‌ (18514) నైట్‌ ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 4 నుంచి 11వ తేదీ వరకు దంతేవాడ వరకు మాత్రమే నడుస్తుంది.

కిరండూల్‌–విశాఖపట్నం (18513) నైట్‌ ఎక్స్‌ప్రెస్‌ ఈ నెల 5 నుంచి 12 వ తేదీ వరకు దంతేవాడ నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటుంది.

విశాఖపట్నం– కిరండూల్‌ (08551) పాసింజర్‌ స్పెషల్‌ ఈ నెల 4 నుంచి 11వ తేదీ వరకు దంతేవాడ వరకు మాత్రమే నడుస్తుంది.

► కిరండూల్‌– విశాఖపట్నం(08552) పాసింజర్‌ స్పెషల్‌ ఈ నెల 5 నుంచి 12వ తేదీ వరకు దంతేవాడ నుంచి బయలుదేరి విశాఖపట్నం చేరుకుంటుంది.

► ఈ నెల 4న రామేశ్వరం–భువనేశ్వర్‌ (20895), బెంగళూరు–భువనేశ్వర్‌(18464) ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌లు మార్గమధ్యలో 45 నిమిషాలు, 30 నిమిషాలు నిలిపివేస్తారు.

Read latest Visakhapatnam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top