పలు రైళ్లకు అదనపు కోచ్‌లు
తాటిచెట్లపాలెం: ప్రయాణికుల సౌకర్యార్థం వాల్తేర్ డివిజన్ పరిధిలో నడుస్తున్న పలు రైళ్లకు ఆయా తేదీల్లో అదనంగా థర్డ్ ఏసీ కోచ్‌లను జతచేస్తున్నారు. భువనేశ్వర్–కేఎస్‌ఆర్ బెంగళూరు(18463) ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌కు ఈ నెల 16, 21వ తేదీల్లో, తిరుగు ప్రయాణంలో కేఎస్‌ఆర్ బెంగళూరు–భువనేశ్వర్ (18464) ప్రశాంతి ఎక్స్‌ప్రెస్‌కు ఈ నెల 17, 22వ తేదీల్లో ఒక థర్డ్ ఏసీ కోచ్‌ను జతచేస్తున్నారు. భువనేశ్వర్–తిరుపతి(22879)సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు ఈ నెల 21, 28వ తేదీల్లో, తిరుగు ప్రయాణంలో తిరుపతి–భువనేశ్వర్(22880)సూపర్‌ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్‌కు ఈ నెల 22, మార్చి 1వ తేదీల్లో ఒక థర్డ్ ఏసీ కోచ్‌ను జతచేస్తున్నారు


