పలుచోట్ల వ్యాపార కార్యకలాపాలకు.. క్వారీల ఏర్పాటు, అనుమతులు లేకుండా రహదారులు అక్రమార్కులకు లబ్ధి చేకూరేలా అధికారుల తీరు జిల్లాలో ఫారెస్ట్ ల్యాండ్ 1,08,000 ఎకరాలు కొడంగల్ నియోజకవర్గంలో 2వేల ఎకరాలు స్వాహా బషీరాబాద్ – కర్ణాటక సరిహద్దులో 1,500 ఎకరాలు..
వికారాబాద్ సమీపంలోని అనంతగిరి అడవులు
వికారాబాద్: అటవీ శాఖలో అక్రమాలు.. అవకతవకలు.. ఆక్రమణలు సర్వసాధారణమయ్యాయి. అధికారులు ఎవరు ఉన్నా.. ఈ పరంపర కొనసాగుతూనే ఉంది. అడవుల ఆక్రమణలకు అడ్డూ అదు పూ లేకుండా పోతోంది. యథేచ్ఛగా కబ్జా చేసి క్వా రీలు, రిసార్ట్‌లు నిర్వహిస్తున్నారు. ఆక్రమణలను అడ్డుకునేందుకు ప్రయత్నించే అధికారులపై బదిలీ వేటు పడటం సాధరణమైపోయింది. మరో పక్క భూముల సంరక్షణ, అభివృద్ధి పేరిట అధికారులు చేస్తున్న కార్యక్రమాల్లో కూడా అవకతవకలు చోటు చేసుకుంటున్నాయి. జిల్లాలో మొత్తం 1,08, 000 ఎకరాల అటవీ భూములు ఉండగా దాదాపు 25 శాతానికి పైగా అంటే సుమారు 31 వేల ఎకరాలు ఆక్రమణకు గురైనట్లు గణాంకాలు చెబుతున్నాయి. జిల్లాలో మొత్తం 94 ఫారెస్టు బ్లాకులు ఉండగా కొన్ని పూర్తిగా కబ్జా కోరల్లోకి వెళ్లాయి. మరికొన్ని చోట్ల 50 శాతం నుంచి 90 శాతం వరకు ఆక్రమణకు గురయ్యాయి. గతంలో అటవీ భూములను కేవలం వ్యవసాయం కోసం ఆక్రమించేవారు. ప్రస్తు తం వ్యాపారం కోసం కబ్జాలకు పాల్పడుతున్నారు. రక్షించాల్సిన యంత్రాంగం చోద్యం చూస్తోంది. కొన్ని చోట్ల అక్రమార్కులకు లబ్ధి చేకూరేలా వ్యవహరిస్తున్నారనే విమర్శలు ఉన్నాయి.
మచ్చుకు కొన్ని..
యథేచ్ఛగా వ్యాపారం
వికారాబాద్ రేంజ్ పరిధిలోని అటవీ భూముల్లో రెండు క్వారీలు నిర్వహిస్తున్నారు. ఒకచోట రూ.160 కోట్లు, మరో చోట రూ.60 కోట్ల విలువైన ఖనిజాన్ని అక్రమంగా తవ్వి తరలించారని తేలడంతో అధికారులు గతంలో కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. తాండూరు ఫారెస్టు రేంజ్‌లోని ఓ క్వారీలో సైతం రూ.60 కోట్ల విలువైన ఖనిజ సంపద కొల్లగొట్టారని గుర్తించి కోర్టులో కౌంటర్ దాఖలు చేశారు. దుద్యాల ఫారెస్టు పరిధిలోని ఓ క్వారీలో అక్రమ తవ్వకాలు జరుపుతున్నారని నోటీసులు జారీ చేశారు. అనంతగిరి సమీపంలోని అటవీ భూమిని ఆక్రమించి రిసార్ట్ నిర్వహిస్తున్న వ్యక్తి నోటీసులు ఇవ్వటంతో పాటు కోర్టులో కౌంటర్ వేశారు. పూడూరు మండలం దామగుండం సమీపంలో ఓ రిసార్ట్స్ ఫారెస్టు భూమిలో ఏర్పాటు చేయగా నోటీసులు ఇచ్చారు. ఇదంత గతంలో జరిగినవి కాగా.. ప్రస్తుతం కొందరు అధికారులు అక్రమార్కులతో లోపాయికారీగా వ్యవహరిస్తూ చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దర్జాగా అటవీ భూముల ఆక్రమణ


