యాలాల: గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడాకారులను ప్రోత్సహిస్తామని మండలి చీఫ్‌విప్ పట్నం మహేందర్‌రెడ్డి అన్నారు. మండలంలోని తిమ్మాయిపల్లికి చెందిన సంతోష్‌కుమార్ ఇటీవల హైదరాబాద్‌లో నిర్వహించిన స్కూల్ గేమ్స్ అండర్ – 19 పరుగు పందెంలో 5 కి.మీటర్ల విభాగంలో బంగారు పతకం, 3 కి.మీ. పందెంలో కాంస్య పతకాన్ని సాధించాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో మెరుగైన, నాణ్యమైన క్రీడాకారులు ఉన్నారని, వారందరిని గుర్తించి ప్రోత్సహించే బాధ్యత ప్రభుత్వాలపై ఉందన్నారు. నైపుణ్యం ప్రదర్శించిన క్రీడాకారులను రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించేలా ప్రోత్సహిస్తామన్నారు. కార్యక్రమంలో రామప్ప, అంజయ్య, నవీన్, రాము, తుల్జారాం, నర్సింహులు, మల్లేష్, రాజు తదితరులు పాల్గొన్నారు.
మండలి చీఫ్‌విప్ పట్నం మహేందర్‌రెడ్డి


