గరుడ వాహనంపై స్వామివారు | - | Sakshi
Sakshi News home page

గరుడ వాహనంపై స్వామివారు

Nov 26 2026 12:21 PM | Updated on Nov 26 2026 12:21 PM

అనంతగిరి: అనంతపద్మనాభ స్వామి ఆలయ కార్తీకమాస పెద్ద జాతరలో భాగంగా బుధ వా రం స్వామివారు గరుడ వాహనంపై విహరించారు. ఉదయం ఆలయంలో ప్రత్యేక పూజలు, అర్చనలు, అభిషేకాలు నిర్వహించారు. 11 గంటలకు అనంతుడు గరుడ వాహనంపై ఆశీనులై ఆలయ మాడవీధుల్లో విహరించారు. కార్యక్రమంలో ఈఓ నరేందర్‌, ట్రస్టీ పద్మనాభం, అర్చకులు, భక్తులు పాల్గొన్నారు.

సాయంత్రం కోర్టులు వద్దు

కొడంగల్‌: సాయంత్రం కోర్టులు వద్దని కొడంగల్‌లో న్యాయవాదులు నిరసన తెలిపారు. బుధవారం విధులు బహిష్కరించారు. పెండింగ్‌ కేసులను తగ్గించాలనే ఉద్దేశంతో కేంద్ర న్యా య శాఖ ప్రతిపాదించిన సాయంత్రం కోర్టుల ఏర్పాటు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నట్లు తెలి పారు. కొడంగల్‌ బార్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిరసన తెలియజేస్తున్నట్లు చెప్పారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు కోర్టుల్లో విధులు నిర్వహిస్తున్న న్యాయవాదులు తిరిగి సాయంత్రం వేళల్లో విధులకు రావడం కష్టంగా ఉంటుందన్నారు. ఆరోగ్య సమస్యలు వస్తాయ ని ఆవేదన వ్యక్తం చేశారు. మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం ఉందన్నారు. కేంద్ర న్యా య శాఖ ఈ విషయాన్ని పునఃపరిశీలన చేయా లని కోరారు. కార్యక్రమంలో న్యాయవాదులు బస్వరాజు, కరుణాకర్‌రెడ్డి, రమేష్‌, వెంకట య్య, రాములు, రవీందర్‌నాయక్‌, నామాజీ తదితరులు పాల్గొన్నారు.

కబడ్డీ జాతీయ జట్టులో

మెట్లకుంట విద్యార్థి

బొంరాస్‌పేట:ఇటీవల మహబూబాబాద్‌ జిల్లా తొర్రూరులో జరిగిన అండర్‌ –14 కబ డ్డీ పోటీల్లో మండలంలోని మెట్లకుంటకు చెందిన మహ్మద్‌ రెహా న్‌ ప్రతిభ చాటి జాతీయస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు.విద్యార్థిని పరిగి న్యూ బ్రిలియెంట్‌ పాఠశాల డైరెక్టర్‌ వెంకటేశ్వర్లు, ప్రధానోపాధ్యాయుడు శ్రీనివాస్‌రెడ్డి, ప్రిన్సిపాల్‌ రమేశ్‌, పీడీ శ్రీనునాయక్‌, సర్పంచ్‌ ఉమాదేవి, ఉప సర్పంచ్‌ రత్నం తదితరులు అభినందించారు. జాతీయస్థాయిలో రాణించాలని ఆకాంక్షించారు.

పెండింగ్‌ స్కాలర్‌ షిప్‌లు

విడుదల చేయాలి

బీసీ సంక్షేమ సంఘం

జిల్లా అధ్యక్షుడు యాదగిరి యాదవ్‌

అనంతగిరి: స్కాలర్‌ షిప్‌ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బీసీ సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు యాదగిరి యాదవ్‌ డిమాండ్‌ చేశారు. బుధవారం వికారాబాద్‌లో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులతో కలిసి ఆర్‌డీఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలో అనేక వృథా ఖర్చులు పెడుతున్న ప్రభుత్వం.. భావి భారత పౌరులుగా ఎదుగుతున్న విద్యార్థుల స్కాలర్‌ షిప్‌, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ విడుదల చేయడంలో నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. దీంతో విద్యార్థులకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ఉన్నత చదువులకు దూరమవుతున్నారని తెలిపారు. ప్రభుత్వం ఇదే మొండి వైఖరి అవలంబిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో సంఘం నాయకులు చంద్రశేఖర్‌, రాములు గౌడ్‌, శ్రీనివాస్‌, సాయిలు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement