ఆ దిశగా ప్రభుత్వ అడుగులు ఈ నెల 18న నోటిఫికేషన్ జారీ 21 రోజుల్లో అభ్యంతరాలుతెలపాలని సూచన ఉమ్మడి జిల్లాలో డీసీఎంఎస్ కేంద్రాలు 8
తాండూరు: జిల్లా సహకార మార్కెటింగ్ సంఘం(డీసీఎంఎస్)ను తెలంగాణ సహకార మార్కెటింగ్ సమాఖ్య(టీజీ మార్క్‌ఫెడ్)లో విలీనం చేసేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. డీసీఎంఎస్ ఆర్థిక పరిస్థితి, నిర్వహణ వైఫల్యాలు తదితర వాటిని దృష్టిలో ఉంచుకొని ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది. ఈ మేరకు సహకార సంఘాల రిజిస్ట్రార్ ఈ నెల 18న నోటిఫికేషన్ జారీ చేశారు. విలీన ప్రతిపాదనపై సభ్యులు, వాటాదారులు, డిపాజిటర్లు, రుణదాతలు, ఉద్యోగులు, ఇతర సంబంధిత వ్యక్తులు 21 రోజుల్లోగా అభ్యంతరాలు, సూచనలు చేయాలని నోటీసులో పేర్కొన్నారు.
ఆర్థిక భారంగా మారిన డీసీఎంఎస్
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో నాలుగు దశాబ్దాలుగా డీసీఎంఎస్ కేంద్రాల ద్వారా రైతులకు సేవలు అందిస్తున్నారు. వికారాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల పరిధిలో ఎనిమిది కేంద్రాలు కొనసాగుతున్నాయి. ఇందులో తాండూరు, పరిగి, వికారాబాద్, చేవెళ్ల, ఇబ్రహీంపట్నం, మేడ్చల్, శంకర్‌పల్లి, పాల్మాకుల ఉన్నాయి. 1990 నుంచి 2018 వరకు వీ టి ద్వారా రైతులకు ఎరువులు, విత్తనాలు పంపిణీ చేసేవారు. పంట ఉత్పత్తుల కొనుగోలు, రైస్, దాల్ మిల్లులను నిర్వహిస్తూ వచ్చారు.గతంలో ఈ కేంద్రాలు లాభాల బాటలో నడవగా.. అధికారులు పంట కొనుగోళ్ల విషయంలో అక్రమాలకు పాల్ప డ్డారనే ఆరోపణలు వచ్చాయి. 2018 నుంచి వీటి నిర్వాహణ ఆపేశారు.తాండూరులో దాల్, రైస్‌మి ల్లులు మూతపడ్డాయి. ప్రస్తుతం సంఘం స్థలాలు, దుకాణాల అద్దెలు వసూలు చేయడం.. ఏటారెండు సార్లు వరి ధాన్యం కొనుగోళ్లు చేయడానికే పరిమితమయ్యారు. దీంతో ఆర్థిక పరిస్థితి ఆందోళనకరంగా మారింది. 2024 –25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తుది అడిట్ నివేదిక ప్రకారం డీసీఎంఎస్‌లలో పేరుకుపోయిన నష్టాలు రూ.12.20 కోట్లు వరకు ఉన్నట్లు నోటిఫికేషన్‌లో ధ్రువీకరించారు. మరోవైపు సంస్థ వార్షీక ఉద్యోగుల వేతనాలు, నిర్వహణ వ్యయం సుమారు రూ.4.02 కోట్లు వెచ్చిస్తున్నారు. సంఘంలో ప్రభుత్వం పెట్టుబడిగా పె ట్టిన వాటా రూ.1.36 కోట్లు కూడా ఉంది. నష్టాల బాటలో ఉన్న డీసీఎంఎస్‌ను మార్క్‌ఫెడ్‌లోకి విలీ నం చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్లు తెలిసింది.
నామ్‌కే వాస్తేగా..
వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, విక్రయా లు, మార్కెటింగ్ వ్యవసాయ ఇన్‌పుట్లు, పనిముట్ల పంపిణీ, ఉత్పత్తుల ప్రాసెసింగ్, గ్రేడింగ్, రవాణా, రైతులకు శిక్షణ, అవగాహన కల్పించడం డీసీఎంఎస్ ప్రధాన లక్ష్యాలు. అయితే వీటిని పూర్తిస్థాయిలో అమలు చేయ డం లేదని ఉన్నతాధికారుల పరిశీలనలో వెల్లడైంది. మరోవైపు వీటి కార్యకలాపాలు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పరిధిలో ని సేవలతో ముడిపడి ఉండటంతో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. దీంతో మార్క్‌ఫెడ్ కూడా వ్యవసాయ ఉత్పత్తుల కొనుగోలు, మార్కెటింగ్ గోదాములు నిర్వహణ లాంటి సేవలను అందిస్తోంది. దీంతో డీసీఎంఎస్‌ను మార్క్‌ఫెడ్‌లోకి విలీనం చేసి రైతులకు మరింత ఉత్తమ సేవలను అందించాలని ప్రభుత్వం భావిస్తోంది. అంతే కాకుండా విలీనంలో భాగంగా డీసీఎంఎస్‌కు చెందిన ఆస్తు లు, అప్పులు, ఉద్యోగులు, ఒప్పంద బాధ్యతలు, రికవరీలు, పెండింగ్ సివిల్ కేసులు, అమలు ప్రక్రియలు, క్రిమినల్ కేసులు, విజిలెన్స్ విచారణలు, ఇతర న్యాయపరమైన వ్యవహారాలన్నీ చట్టప్రకారం మార్క్‌ఫెడ్‌కు బదిలీ చేయాలని నోటిఫికేషన్‌లో ప్రతిపాదించారు. దీంతో త్వరలోనే ఉమ్మడి జిల్లాలో ఉన్న డీసీఎంఎస్ కేంద్రాలు మార్క్‌ఫెడ్ కేంద్రాలుగా త్వరలో మారనున్నాయి.


