ప్రజారోగ్యంపై దృష్టి సారించాలి | - | Sakshi
Sakshi News home page

ప్రజారోగ్యంపై దృష్టి సారించాలి

Oct 7 2026 9:14 AM | Updated on Oct 7 2026 9:14 AM

షాద్‌నగర్‌: ప్రజారోగ్యంపై వైద్యులు దృష్టి సారించాలని అదనపు కలెక్టర్‌ కిరణ్మయి అన్నారు. పట్టణంలోని ప్రభుత్వ కమ్యూనిటీ ఆస్పత్రిని మంగళవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాజరు పట్టిక, ఓపీ, ఇన్‌ పేషంట్‌ వార్డులతో పాటు ఆపరేషన్‌ థియేటర్‌ను పరిశీలించారు. అనంతరం పట్టణ శివారులో నూతనంగా నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులు, ప్రభుత్వ పాఠశాలను పరిశీలించారు. విద్యార్థులతో మాట్లాడి వారు ఎదుర్కొంటున్న సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ.. ఆస్పత్రికి వచ్చే రోగులకు నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సూచించారు. వైద్యులు ఎల్లవేళలా అందుబాటులో ఉండాలన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో పని చేస్తున్న ఆర్‌ఎంపీలు, పీఎంపీలు నిబంధనల ప్రకారం తమ పరిధిలో మాత్రమే సేవలు అందించాలని తెలిపారు. కేవలం ప్రథమ చికిత్స మాత్రమే అందించాలని, అలా కాకుండా పరిధి దాటి నిబంధనలకు విరుద్ధంగా వైద్యం అందించడం, ఆపరేషన్లు చేయడం వంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రభుత్వం పేద విద్యార్థుల సంక్షేమం కోసం కృషి చేస్తోందని చెప్పారు. విద్యార్థులు చదువులో రాణించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఆకాంక్షించారు. విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించి వారి భవిష్యత్తుకు ఉపాధ్యాయులు బంగారు బాటలు వేయాలని సూచించారు. ఆమె వెంట తహసీల్దార్‌ నాగయ్య, మున్సిపల్‌ కమిషనర్‌ సునీత, ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ విష్ణువర్ధన్‌, ఎంఈఓ మనోహర్‌ తదితరులు ఉన్నారు.

అధికారులతో సమీక్ష సమావేశం

పట్టణంలోని రెడ్‌రోజ్‌ ఫంక్షన్‌ హాల్‌లో డివిజన్‌ స్థాయి అధికారులతో అదనపు కలెక్టర్‌ కిరణ్మయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. గ్రామీణ ప్రాంతాల్లో తాగునీటి సమస్య తలెత్తకుండా జాగ్రత్తలు తీసుకోవాలని, నీటి వనరులను సంరక్షించాలని, భూగర్భ జాలాల పెంపునకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement