ఉచిత ప్రయాణం ఎలా ఉంది..? | - | Sakshi
Sakshi News home page

ఉచిత ప్రయాణం ఎలా ఉంది..?

Oct 7 2026 9:14 AM | Updated on Oct 7 2026 9:14 AM

ఉచిత ప్రయాణం ఎలా ఉంది..?

● ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి

● ఆర్టీసీ బస్సులో కాసేపు ప్రయాణం

● మహిళా ప్రయాణికులతో మాటామంతి

ఇబ్రహీంపట్నం రూరల్‌: ‘ఉచిత ప్రయాణం ఎలా ఉంది.. మహాలక్ష్మి పథకం మీద మీ అభిప్రాయం ఏమిటి..’ అంటూ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మహిళా ప్రయాణికులను ఆరా తీశారు. మంగళవారం ఆదిభట్ల జీహెచ్‌ఎంసీ పరిధిలోని బొంగ్లూర్‌ సమీపంలో ఉన్న ఔటర్‌రింగ్‌రోడ్డు వద్ద ఆయన కాసేపు ఆగారు. అదే సమపంలో ఇబ్రహీంపట్నం నుంచి హైదరాబాద్‌ వెళ్తున్న ఆర్టీసీ బస్సును నిలిపి బస్సెక్కారు. కండక్టర్‌ వద్ద టికెట్‌ తీసుకుని సీట్లో కుర్చొని ఇంజాపూర్‌ వరకు ప్రయాణం చేశారు. పక్కనే ఉన్న మహిళలతో మాట్లాడారు. ఉచిత టికెట్‌ ప్రయాణం ఎలా ఉందని అడిగి తెలుసుకున్నారు. కళాశాల నుంచి తిరిగి వెళ్తున్న పలువురు విద్యార్థినులు ఎమ్మెల్యేకు ఉచిత బస్సు ప్రయాణం ద్వారా చేకూరుతున్న ప్రయోజనాలు విరవించారు. రేవంత్‌రెడ్డి నేతృత్వంలో ప్రజా ప్రభుత్వం తెచ్చిన మహాలక్ష్మి పథకం ద్వారా రాష్ట్రంలో రోజుకు దాదాపు నలభై లక్షల మంది ఉచిత ప్రయాణం చేస్తుంటే ఇబ్రహీంపట్నం డిపో పరిధిలో లక్ష మందికి పైగా ప్రయాణం చేస్తున్నట్లు ఎమ్మెల్యే వివరించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement