బషీరాబాద్: అనుమతి పత్రాలు లేకుండా ఇసుక తరలిస్తున్న నాలుగు ట్రాక్టర్లను బషీరాబాద్ పోలీసులు పట్టుకున్నారు. సోమవారం ఉదయం వీర్‌శెట్టిపల్లి వాగు నుంచి కాశీంపూర్‌కు అక్రమంగా ఇసుక తరలిస్తుండగా మల్కన్‌గిరి వద్ద పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వాహనాలను స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ విఠల్ తెలిపారు. పట్టుబడిన వాటిలో టీఎస్34 టీబీ 4520 ట్రాక్టర్‌ను గోనూరు గ్రామానికి చెందిన గోవింద్ నడుపుతుండగా, టీఎస్34బీ 4318ను అనంతప్ప, టీఎస్34 డీ 7728ను రాజు, టీఎస్34 టీఆర్ 2722 వాహనాన్ని రెడ్డిగణాపూర్‌కు చెందిన ప్రసాద్ నడుపుతున్నట్లు పోలీసులు తెలిపారు. అనుమతులు లేకుండా ఇసుక తరలిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్‌ఐ హెచ్చరించారు.
అక్రమంగా ఇసుక తరలిస్తూ
పట్టుబడిన వాహనాలు


