పహాడీషరీఫ్: గుర్తు తెలియని వృద్ధురాలి మృతదేహం లభ్యమైన సంఘటన పహాడీషరీఫ్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మామిడిపల్లి గ్రామంలో కొన్నాళ్లుగా 60–65 ఏళ్ల వయసున్న గుర్తు తెలియని వృద్ధురాలు భిక్షాటన చేస్తోంది. ఆదివారం రాత్రి బొడ్రాయి సమీపంలో ఆమె కింద పడిపోయి ఉండడాన్ని గమనించిన గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించగా, అప్పటికే మృతి చెంది కనిపించింది. ఒంటిపై ఎలాంటి గాయాలు లేవని, అనారోగ్యంతో మృతి చెంది ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. ఈమె సంబంధీకులెవరైనా ఉంటే పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


