బొంరాస్‌పేట: మండల పరిధిలోని రేగడిమైలారంలో నిర్వహించిన బీఆర్‌ఎస్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నీ ఆదివారంతో ముగిసింది. వడ్ల నరేందర్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ టోర్నీలో విశాల్ బంజారా, వెంకట్ స్పాంటన్ టీంలు ఫైనల్‌లో తలపడ్డాయి. ఈ సందర్భంగా విజేతగా నిలిచిన బంజారా టీమ్‌కు రూ.10 వేల నగదు బహుమతి, రన్నరప్‌గా నిలిచిన వెంకట్ స్పాంటన్ టీమ్‌కు రూ. 5వేలు నగదు బహుమతిలో పాటు ట్రోఫీ అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ మాజీ సభ్యుడు జగదీశ్వరయ్య, సీనియర్ నాయకుడు గోవింద్‌రెడ్డి, నాయకులు మంగలి వెంకటయ్య, దశరథ్, పాపయ్య, మహేశ్, శేఖర్, టీమ్ లీడర్లు కై లాస్, అశోక్, అర్జున్, మహేశ్ పాల్గొన్నారు.


