మేకల దొంగలకు దేహశుద్ధి | - | Sakshi
Sakshi News home page

మేకల దొంగలకు దేహశుద్ధి

Jun 8 2026 10:11 AM | Updated on Jun 8 2026 10:11 AM

మేకల దొంగలకు దేహశుద్ధి

పరిగి: మేకల దొంగలకు దేహశుద్ధి చేసిన ఘటన పరిగి పట్టణ కేంద్రంలో ఆదివారం చోటు చేసుకుంది. ఎస్‌ఐ మోహన్‌ కృష్ణ తెలిపిన ప్రకారం.. ధారూరు మండల రాజాపూర్‌ గ్రామానికి చెందిన అశోక్‌, బొంరాస్‌పేట మండలం సాలేండపూర్‌ తండాకు చెందిన తుల్జానాయక్‌ పట్టణంలోని గంజ్‌ రోడ్‌, మార్కెట్‌ మేసే మేకలను అపహరించేందుకు వచ్చారు. అనుమానాస్పందంగా కాలనీలో తిరుగుతుండగా స్థానిక యువకులు వారిని గమనించారు. ఈ క్రమంలో బైక్‌పై రెండు మేకలను ఎక్కించుకుని పరారయ్యేందుకు యత్నిస్తుండగా అడ్డుకున్నారు. దీంతో స్థానికులు వారిద్దరికి దేహ శుద్ధి చేసి పోలీసులకు సమాచారం ఇచ్చారు. కేసు దర్యాప్తులో ఉంది.

Advertisement
 
Advertisement
Advertisement